అనుకోకుండా జరిగి పోయిందని అంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరి.. హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రస్తుతం ఓ బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ బయోపిక్ ఎవరిదో కాదు.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ది. `సైనా` పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా షూటింగ్ జరుగుతుంది. అమోల్ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో టైటిల్ పాత్రలో నటిస్తోన్న పరిణీతి చో్ప్రా గాయపడింది. ఆమె మెడకు గాయమైంది. ఈ విషయాన్ని పరిణీతి చోప్రా తెలియజేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు గాయమైందని విషయాన్ని పోస్ట్ చేసింది. ``డ్యూడ్స్ `సైనా` చిత్రీకరణలో గాయాలు కాకూడదని యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకుంది. కానీ అనుకోకుండా జరిగిపోయింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటాను``అని మెసేజ్ పోస్ట్ చేసింది.
నిజానికి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో ముందు శ్రద్ధాకపూర్ నటించాల్సింది. శ్రద్ధాకపూర్ కొన్నిరోజుల పాటు షూటింగ్లో కూడా పాల్గొంది. కానీ డేట్స్ విషయంలో సర్దుబాటు చేయలేకపోవడం.. మధ్యలో శ్రద్ధాకపూర్‌కి ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి కారణాలతో చిత్ర నిర్మాతలు శ్రద్ధాకపూర్ స్థానంలో పరిణీతి చోప్రాను ఎంపిక చేసుకున్నారు. షూటింగ్ కూడా స్టార్టయ్యింది. ఇప్పుడు పరిణీతికి కూడా గాయమైంది. ఈ సినిమా విడుదలను విషయంలో నిర్మాతలు ఇంకా క్లారిటీకి రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout