జగన్‌కు, ఏపీ ప్రజలకు థ్యాంక్స్.. మీకు సేవ చేస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానిని పెద్దల సభకు పంపుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం నాడు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మొత్తం నలుగురు కాగా.. వారిలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ సీనియర్ నేత, రామ్‌కీ అధినేత అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానికి ఉన్నారు. ఈ మేరకు తన పేరు ఉండటంతో నత్వాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అందరికీ ధన్యవాదాలు..!
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. వైఎస్సార్‌సీపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు. ఏపీ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తాను’ అని ట్విట్టర్‌లో నత్వాని రాసుకొచ్చారు. కాగా.. నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇవ్వడంతో ఈ మేరకు జగన్.. నిర్ణయం తీసుకుని ఆయన్ను పెద్దల సభకు పంపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments