జగన్‌కు, ఏపీ ప్రజలకు థ్యాంక్స్.. మీకు సేవ చేస్తా!

  • IndiaGlitz, [Monday,March 09 2020]

ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానిని పెద్దల సభకు పంపుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం నాడు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మొత్తం నలుగురు కాగా.. వారిలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ సీనియర్ నేత, రామ్‌కీ అధినేత అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానికి ఉన్నారు. ఈ మేరకు తన పేరు ఉండటంతో నత్వాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

అందరికీ ధన్యవాదాలు..!

‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. వైఎస్సార్‌సీపీకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఏపీ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేస్తాను’ అని ట్విట్టర్‌లో నత్వాని రాసుకొచ్చారు. కాగా.. నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇవ్వడంతో ఈ మేరకు జగన్.. నిర్ణయం తీసుకుని ఆయన్ను పెద్దల సభకు పంపారు.

More News

‘ప్రేమపిపాసి’ సక్సెస్ పై  కాన్ఫిడెంట్ గా ఉన్నాం - చిత్ర నిర్మాత  పి ఎస్ రామకృష్ణ(ఆర్‌.కె)

సినిమా రంగంలో రాణించాంటే ప్యాషన్‌ ఉంటేనే సరిపోదు.. పక్కా ప్రణాళిక కూడా అవసరమే అంటున్నారు నిర్మాత రామకృష్ణ(ఆర్‌.కె).

సీసాలతో కొట్టడమేంటి.. చంపేస్తారా..? : ప్రకాష్ రాజ్

తెలుగు బిగ్ బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కొన్నిరోజుల క్రితం పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని

పాన్ ఇండియా సినిమా నుండి త‌ప్పుకున్న నాగ్‌!!

బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ పార్ట్ 1 త‌ర్వాత ద‌క్షిణాది నుండి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా విడుద‌ల‌వుతున్నాయి.

ఏపీ నుంచి ‘పెద్దల’ సభకు వీళ్లే.. పక్కా వ్యూహంతో జగన్!

ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసేశారు.

మీ ప‌ని మీరు స‌రిగ్గా చేయండి.. నా ప‌ని న‌న్ను చేసుకోనివ్వండి: రానా

టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి ముంబైకి మీడియాకు చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్‌పై మండిప‌డ్డారు.