'పరిగెత్తు పరిగెత్తు' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల!

  • IndiaGlitz, [Monday,September 28 2020]

ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్ బ్యానర్ పై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లు గా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పరిగెత్తు పరిగెత్తు యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత, యామినీ కృష్ణ అక్కరాజు మాట్లాడుతూ... ‘‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. పరిగెత్తు పరిగెత్తు చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు. అలాగే ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్‌ కశ్యప్‌ మా సినిమాకి సంగీతం అందించడం సంతోషంగా ఉంది. కల్యాణ్‌ సమి బ్యూటిఫుల్‌ విజువల్స్‌, వెంకట ప్రభు ఎడిటింగ్‌, రాజ్‌కుమార్‌ ఆర్ట్‌ వర్క్‌, శంకర్‌ స్టంట్స్‌ సినిమాకి ప్లస్‌ అవుతాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలువుతామని అన్నారు.

More News

విచారణలో దీపిక కన్నీళ్లు.. ఎమోషనల్ డ్రామా కట్టిబెట్టమన్న ఎన్సీబీ!

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్టార్ హీరోయిన్లను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణను తొలుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,

హేమంత్‌ది పరువు హత్యేనని తేల్చిన పోలీసులు

హేమంత్ మర్డర్ కేసును అన్ని రకాలుగా విచారించిన మీదట అతనిది పరువు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

నాగ‌చైత‌న్య రిలీజ్ చేసిన 'ఒరేయ్‌ బుజ్జిగా..' ట్రైల‌ర్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో

బండ్లగణేశ్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

పవర్‌స్టార్‌ వపన్‌కల్యాణ్‌, నిర్మాత బండ్లగణేశ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రూపొందనుంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్లగణేశ్‌ అధికారికంగా ప్రకటించారు.

బాలు సంగీత వర్సిటీ పెట్టాలంటూ జగన్‌కు చంద్రబాబు లేఖ

లెజెండ్రీ సింగర్‌ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గొప్పతనాన్ని గుర్తించి భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా తగు కార్యక్రమాలను