విడుదలకు సిద్ధంగా లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన 'పరిచయం'

  • IndiaGlitz, [Thursday,May 24 2018]

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం పరిచయం. విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సామ్రాట్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఫస్ట్ కాపీ చుసిన టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ప్రేమికుల హృదయానికి దగ్గరగా చిత్రం ఉంటుందని, ఒక మంచి ఫీలున్న ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పక ఆధరిస్తారని..చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా తెలిపారు.

చిత్ర నిర్మాత రియాజ్ మాట్లాడుతూ.. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, ఫస్ట్ కాపీ చూసి సినిమా మీద కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యిందని, తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని, త్వరలోనే సెన్సార్ కి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ మొదటి వరంలో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో పరుచూరి వెంకటేశ్వర్ రావు, రాజీవ్ కనకాల, పృద్విరాజ్, సిజ్జు, శివ నారాయణ, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రాలలో కనిపిస్తారు.

More News

అనుతో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా - ర‌వితేజ‌

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

మే 26న హీరో సుధీర్‌ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

ప్రేమ‌ క‌థా చిత్రం , భ‌లే మంచి రోజు, కృష్ణ‌మ్మ‌ క‌లిపింది ఇద్ద‌రిని లాంటి విభిన్న ప్రేమ‌ క‌థా చిత్రాల్లో న‌టించి మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో న‌టించిన‌ హీరో సుధీర్ బాబు

జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్‌-కరుణాకరన్‌ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం.

ఏదైనా ఒక‌టి సంక్రాంతికే అంటున్న‌ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తమిళ రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన రవితేజ

విజయ్, సమంత జంటగా నటించిన తమిళ  చిత్రం 'తెరి'. 2016లో వచ్చిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో కూడా 'పోలీస్‌' పేరుతో అనువదించారు.