విడుదలకు సిద్ధంగా లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన 'పరిచయం'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైదరాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం "పరిచయం". విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సామ్రాట్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఫస్ట్ కాపీ చుసిన టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ప్రేమికుల హృదయానికి దగ్గరగా చిత్రం ఉంటుందని, ఒక మంచి ఫీలున్న ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పక ఆధరిస్తారని..చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా తెలిపారు.
చిత్ర నిర్మాత రియాజ్ మాట్లాడుతూ.. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, ఫస్ట్ కాపీ చూసి సినిమా మీద కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యిందని, తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని, త్వరలోనే సెన్సార్ కి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ మొదటి వరంలో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో పరుచూరి వెంకటేశ్వర్ రావు, రాజీవ్ కనకాల, పృద్విరాజ్, సిజ్జు, శివ నారాయణ, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రాలలో కనిపిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com