BiggBoss: ఇవే తగ్గించుకుంటే మంచిది.. శ్రీసత్యకు పేరెంట్స్ హెచ్చరిక, నాకెవ్వరూ లేరంటూ కీర్తి కంటతడి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్‌లో సోమవారం నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత అంతా కెప్టెన్సీ టాస్క్ కోసం కుస్తీలు పడతారు. అయితే ఈ వారం మాత్రం హౌస్‌లో అలాంటివేవి కనిపించడం లేదు. బిగ్‌బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేస్తున్నారు. తొలుత ఆదిరెడ్డి భార్యా కూతురు, రాజశేఖర్ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఎవరికి తోచిన విధంగా వారు తమ వాళ్ల ఆటతీరు మెరుగు పరచుకునేందుకు సలహాలు ఇచ్చారు. ఇక బుధవారం ఫైమా తల్లి, శ్రీసత్య తల్లిదండ్రులు, రోహిత్ అమ్మగారు ఇంట్లోకి వచ్చి సందడి చేశారు.
తొలుత ఫైమా తల్లి షాహీదా హౌస్‌లో అడుగుపెట్టారు. సాధారణంగా బయట ఆమె చాలా జోవియల్‌గా వుంటారు. తనను ఇప్పుడు అంతా ఫైమా వాళ్ల అమ్మ గారు అని గుర్తుపట్టి మాట్లాడుతున్నారని, సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారని, చాలా ఆనందంగా వుందని భావోద్వేగానికి గురయ్యారు. హౌస్ మొత్తం సైలెంట్ అవ్వడాన్ని గమనించి షాహీదా వెంటనే.. రేవంత్‌ను చూస్తే తనకు భయమేస్తోందంటూ జోక్ పేల్చి నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా కూతురికి కొన్ని సలహాలు ఇచ్చారు షాహీదా. ఎవిక్షన్ ఫ్రీ పాస్ నువ్వే వాడుకోవాలని, ఎవరికీ ఇవ్వొద్దని చెప్పింది. అలాగే కోపం, వెటకారం తగ్గించుకోవాలని.. శ్రీసత్య, ఇనయాలపై ఓ కన్నేసి వుంచాలని హెచ్చరించింది.
కాసేపటికీ శ్రీసత్య పేరెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టారు. పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయి వీల్‌చైర్‌కు పరిమితమైన శ్రీసత్య తల్లిని ఆయన తండ్రి లోపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తల్లి పరిస్ధితిని చూసి శ్రీసత్య ఎమోషనల్ అయ్యారు. గేమ్ చాలా బాగా ఆడుతున్నావని... కానీ కోపం, వెటకారం తగ్గించుకోవాలని సూచించారు ఆమె తండ్రి. బిగ్‌బాస్ నిన్ను ఆడపిల్లగా మారుస్తున్నాడు.. ఇళ్లంతా ఊడిపించి పనిచేయిస్తున్నాడు, దీపావళికి ముగ్గు కూడా వేసిందని ఆయన అన్నారు. తర్వాత శ్రీసత్య తల్లి రంగంలోకి దిగారు. కూతురు బెడ్ చెత్తగా వుండటంతో ఆమె చిరాకు పడ్డారు. అంతేకాదు... కూతురి బద్ధకం గురించి సెటైర్లు వేశారు. ఇంట్లో ఇది బెడ్ కూడా దిగదని, దీని రూం కూడా పని మనిషే సర్దుతుందని... భోజనం చేశాక చేయి కడుక్కోవడానికి కూడా మంచం దగ్గరకే నీళ్లు ఇవ్వాలని కూతురి బండారం బయటపెట్టేసింది. అలాంటిది బిగ్‌బాస్ దీని తిక్క బాగా కుదురుస్తున్నారంటూ ప్రశంసించింది. అనంతరం శ్రీసత్య తల్లిదండ్రులు తీసుకొచ్చిన చికెన్ ఫ్రై వంటి పలు వంటకాలను ఇంటి సభ్యులు లాగించేశారు.
అనంతరం బిగ్‌బాస్ కోచింగ్ సెంటర్ టాస్క్ ఈ రోజు కూడా కొనసాగింది. ఈసారి రాజ్ టీచర్‌గా మారి ఇంటి సభ్యులతో పాటలు పాడటాన్ని ప్రాక్టీస్ చేయించారు. ఈ క్రమంలో ఫైమా, శ్రీహాన్‌ల గాత్రాన్ని తట్టుకోలేక హౌస్‌మెట్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. మధ్య మధ్యలో ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, లూప్ అనే గేమ్ ఆడారు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో శ్రీహాన్‌ను ఇంటి సభ్యులు ఆడుకున్నారు. ఫ్రీజ్ కండీషన్‌లో వున్నప్పుడు ఫైమా, శ్రీసత్యలు అతడికి ఆడవేషం వేశారు.
చివరిలో భార్య మెరీనా వెళ్లిపోవడంతో ఒంటరిగా ఫీల్ అవుతున్న రోహిత్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్‌బాస్. కొడుకుని ముద్దాడిన ఆమె... ఒకసారి కెప్టెన్ అయ్యి మా కలను నెరవేర్చు అని రోహిత్‌ను కోరారు. తర్వాత కొడుకుతో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేశారు. ఆదిరెడ్డి డ్యాన్స్ అదిరిపోయిందంటూ సెటైర్లు వేశారు. ఆమెకు తెలుగు సరిగా రాకపోవడంతో హిందీలోనే మాట్లాడారు. ఎపిసోడ్ ముగుస్తుందనగా.. కీర్తి భట్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక్కొక్కరి కుటుంబం హౌస్‌లోకి అడుగుపెడుతూ అప్యాయత చూపిస్తుండటాన్ని చూసి తట్టుకోలేక కంటతడి పెట్టింది. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరూ బతికి లేరని... వున్న బంధువులు కూడా దూరం పెట్టారని బాధపడింది. దీంతో తన తరపున బిగ్‌బాస్ ఎవరిని పంపిస్తారోనని కీర్తి ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com