కన్నబిడ్డల్ని దారుణంగా కడతేర్చారు.. విచారణలో ఏం తేలిందంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆ భార్యాభర్తలిద్దరూ చదువూ సంధ్యాలేని వారు.. ఇద్దరూ విద్యారంగంలో మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. కానీ మూఢభక్తి వారి కళ్లు కప్పేసింది. కన్న బిడ్డల్నే చేతులారా కడతేర్చేలా చేసింది. పాము అయినా కళ్లు కనబడక తన పిల్లలను చంపేస్తుంది కానీ వీరు మాత్రం అన్నీ తెలిసి ఉండి.. ఎందరికో మార్గదర్శకులుగా ఉండాల్సిన వారు కసాయిల కన్నా దారుణంగా ప్రవర్తించారు. వారు తమ బిడ్డలను హత్య చేసిన వైనం ఎవరికైనా కన్నీళ్లు తెప్పించక మానదు.
అసలు విషయంలోకి వెళితే..
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు నివాసముంటున్నారు. వారికి అలేఖ్య(27), సాయి దివ్య(22) అనే ఇద్దరు పిల్లలున్నారు. పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. కాగా.. అలేఖ్య భోపాల్‌లో పీజీ చేస్తోంది. సాయిదివ్య బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.
ఇద్దరు కూతుళ్లను ఇలా హతమార్చారు..
గతేడాది వీరు శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఓ ఇంట్లోకి వచ్చారు. తరచూ ఇంట్లో ఏవో ఒక పూజలు నిర్వహిస్తూనే ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కాగా.. ఆదివారం రాత్రి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం చిన్న కుమార్తెను శూలంతో పొడిచి చంపేశారు. అనంతరం పెద్ద కుమార్తె నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తంనాయుడు తన సహోద్యోగికి చెప్పారు. దీంతో ఆయన వెంటనే పురుషోత్తంనాయుడు ఇంటికి వెళ్లి పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు దిలీప్ కుమార్, రమాదేవి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మళ్లీ తమ బిడ్డలు బతుకుతారనే...
ఈ హత్యోదంతంపై డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. హత్యకు గురైనవారితో పాటు హంతకులంతా పూర్తిగా మూఢభక్తిలో లీనమైపోయారని వెల్లడించారు. తమ బిడ్డలు మళ్లీ బతుకుతారనే మూఢ నమ్మకంతో హత్య చేసినట్టు ప్రాథమికంగా తేలిందన్నారు. యువతులను వారి తల్లే కొట్టి చంపిందని.. ఆ సమయంలో తండ్రి కూడా అక్కడే ఉన్నట్టు విచారణలో తేలిందన్నారు. తల్లిదండ్రులిద్దరూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని.. కాబట్టి వారిద్దరూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులిద్దరూ మంచి విద్యావంతులని.. వివిధ విద్యాసంస్థల్లో పని చేస్తున్నారన్నారు.
పోలీసుల విచారణలో కొత్త విషయాలు..
ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సాయిదివ్య మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ‘శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్’ అంటూ సాయి దివ్య పోస్టు పెట్టింది. అలాగే సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. కాగా.. వారి నివాసంలో దేవుళ్లతో పాటు చిత్రవిచిత్రంగా ఉన్న ఫోటోలను పోలీసులు గుర్తించారు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల సలహా మేరకు వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments