పరుశురామ్‌కి ఝలక్ ఇచ్చిన ప్రొడ్యూసర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ సినిమా పెద్ద హిట్టయితే ఆ దర్శకుడికి వచ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది. సదరు దర్శకుడికి నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చి తమ బ్యానర్‌లో సినిమా చేయాలంటూ లాక్ చేసుకుంటారు. ఇది కామన్‌గా జరిగే విషయం. `గీత గోవిందం` సక్సెస్ తర్వాత డైరెక్టర్ పరుశురామ్‌కి అలాంటి క్రేజ్ వచ్చింది. చాలా మంది నిర్మాతలు తమ బ్యానర్‌లో సినిమాలు చేయాలంటూ అడ్వాన్సులు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే పరుశురామ్ తదుపరి సినిమానుస్టార్ట్ చేయడానికి ఏడాది పైగానే సమయం పట్టింది. స్టార్ హీరోలు ఆయన్ని తిప్పించారు. చివరకు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో పరుశురామ్‌తో సినిమా చేయడానికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన తర్వాత పరుశురామ్‌కు అనుకోని అడ్డంకి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ రూపంలో ఎదురైంది. అప్పుడెప్పుడో పాతిక లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన బీవీఎస్ఎన్ ప్రసాద్ తనతో పరుశురామ్ సినిమా చేయకుండా తప్పించుకుంటున్నాడని కాబట్టి తన అడ్వాన్స్ వడ్డీతో సహా కలిపి ఆరు కోట్లు అయ్యిందని కాబట్టి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. మరో పక్క 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు, హీరో నాగచైతన్య ఈ సమస్య తీరిన తర్వాత షూటింగ్ పెట్టుకుందామని చెప్పేశారు. దీంతో పరుశురామ్ ఇప్పుడు సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments