బాలయ్య కోసం పరుచూరి ప్రయత్నం...
Monday, January 18, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటించిన 99వ సినిమా డిక్టేటర్ సంక్రాంతికి రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక బాలయ్య 100వ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఎవరి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య 100వ సినిమాకి బోయపాటి దర్శకుడు అని ప్రచారం జరిగింది. ఆతర్వాత సింగీతం శ్రీనివాసరావు అని మరో ప్రచారం. ఇదిలా ఉంటే..తాజాగా పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర బాలయ్య కోసం ఓ హిస్టారికల్ స్టోరిని రెడీ చేసాడట. పరుచూరి సిఫార్స్ తో పరుచూరి రవీంద్ర బాలయ్యను కలసి కథ చెప్పాడట. కథ విన్న బాలయ్య బాగుందని చెప్పాడట. త్వరలోనే తన నిర్ణయం తెలియచేస్తానన్నాడట. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో..విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించాలట. మరి...బాలయ్య ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments