బాలయ్య కోసం పరుచూరి ప్రయత్నం...

  • IndiaGlitz, [Monday,January 18 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ న‌టించిన 99వ సినిమా డిక్టేట‌ర్ సంక్రాంతికి రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఇక బాల‌య్య 100వ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంది..? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాల‌య్య 100వ సినిమాకి బోయ‌పాటి ద‌ర్శ‌కుడు అని ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత సింగీతం శ్రీనివాస‌రావు అని మ‌రో ప్ర‌చారం. ఇదిలా ఉంటే..తాజాగా పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు ప‌రుచూరి ర‌వీంద్ర బాల‌య్య కోసం ఓ హిస్టారిక‌ల్ స్టోరిని రెడీ చేసాడ‌ట‌. ప‌రుచూరి సిఫార్స్ తో ప‌రుచూరి ర‌వీంద్ర బాల‌య్య‌ను క‌ల‌సి క‌థ చెప్పాడ‌ట‌. క‌థ విన్న బాల‌య్య బాగుంద‌ని చెప్పాడ‌ట‌. త్వ‌ర‌లోనే త‌న నిర్ణ‌యం తెలియ‌చేస్తాన‌న్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో..విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో రూపొందించాల‌ట‌. మ‌రి...బాల‌య్య ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో చూడాలి.

More News

సూర్యతో రాధిక

తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు ఎస్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పుడు రాధికా శరత్ కుమార్ నటిస్తుండటం విశేషం.

సంక్రాంతి రేసులో విన్నర్ గా నిలిచాం - నాగార్జున

అక్కినేని నాగార్జున,రమ్యకృష్ణ,లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 15న విడుదలైంది.

కేసీఆర్ ను కలిసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు.

విలన్ గా త్రిష....

కమర్షియల్ సినిమాలతో అలరించిన హీరోయిన్ త్రిష ఇప్పుడు సరికొత్త పాత్రల ను ఎంచుకుంటూ సాగిపోతుంది.ఇప్పుడు విలక్షణమైన చిత్రాలను చేస్తుంది.

న్యూ షెడ్యూల్ లో బ్రహ్మోత్సవం...

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.