పేపర్ బాయ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సంతోష్ శోభన్, రియాసుమన్ జంటగా నటిస్తున్న పేపర్ బాయ్ ఆగస్ట్ 31న విడుదల కానుంది. ఈ చిత్ర థియెట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత సంస్థ గీతాఆర్ట్స్ సొంతం చేసుకుంది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా షో వేసి చూపించారు దర్శకుడు సంపత్ నంది. ఈయనే పేపర్ బాయ్ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా చూసిన తర్వాత మెచ్చుకుని ఈ రైట్స్ తీసుకుంది గీతాఆర్ట్స్. మంచి రేట్ ఇచ్చి ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నారు అల్లు అరవింద్. ఈ చిత్రంతో జయశంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ దాటి.. మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుదలకు ముందు ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్ ఉంది.
నటీనటులు: సంతోశ్ శోభన్, రియాసుమన్, తాన్యాహోప్, పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి, విద్యురామన్, జయప్రకాశ్ రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేశ్ విట్టా తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments