పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి.. ఆగ‌స్ట్ 31న విడుద‌ల‌..

  • IndiaGlitz, [Friday,August 24 2018]

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు. పేప‌ర్ బాయ్ లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా రియా సుమ‌న్, తాన్యా హోప్ న‌టించారు.

జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మిలియ‌న్ వ్యూస్ కూడా దాటింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు.

న‌టీన‌టులు: సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌మురళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యాల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్ట త‌దిత‌రులు