విడుదల సన్నాహాల్లో 'పంతులుగారి అమ్మాయి' 'ప్రేమకథ'
Thursday, March 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడలో సంచలన విజయం సాధించిన "రోజ్" అనే చిత్రం తెలుగులో "పంతులుగారి అమ్మాయి" పేరుతో అనువాదమవుతోంది. "ప్రేమకథ" ట్యాగ్ లైన్. డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో కృష్ణ అజయ్ రావు-శ్రావ్య హీరోహీరోయిన్లు. బుల్లెట్ ప్రకాష్, సాధుకోకిల తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సహన హెచ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చంద్రకళ సమర్పణలో.. చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వరప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీమతి అంచాల రాజేశ్వరి-ముద్దం రామచంద్రుడు సహ నిర్మాతలు. అనూప్ సిలీన్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో "లహరి మ్యూజిక్" ద్వారా విడుదలయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ....
నిర్మాత వర ప్రసాద్ మాట్లాడుతూ.. "శివాజీ హీరోగా రూపొందిన "దొరకడు"తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన మా చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్.. ఆ తర్వాత "దండుపాళ్యమ్ అలజడి" అనే అనువాద చిత్రాన్ని అందించింది, "పంతులుగారి అమ్మాయి" మా సంస్థ నుంచి వస్తున్న మూడో చిత్రం, కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సొంతం చేసుకొంటుదనే నమ్మకం ఉంది. బిజినెస్ పరంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ క్యారెక్టర్ చాలా హై లైట్ గా నిలుస్తుంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments