'పంతులుగారి అమ్మాయి' పాటల విడుదల

  • IndiaGlitz, [Saturday,February 27 2016]
కన్నడలో సంచలన విజయం సాధించిన "రోజ్" అనే చిత్రం తెలుగులో "పంతులుగారి అమ్మాయి" పేరుతో అనువాదమవుతోంది. "ప్రేమకథ" ట్యాగ్ లైన్. డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో కృష్ణ అజయ్ రావు-శ్రావ్య హీరోహీరోయిన్లు. బుల్లెట్ ప్రకాష్, సాధుకోకిల తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సహన హెచ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చంద్రకళ సమర్పణలో.. చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వరప్రసాద్ నిర్మిస్తున్నారు.
శ్రీమతి అంచాల రాజేశ్వరి-ముద్దం రామచంద్రుడు సహ నిర్మాతలు. అనూప్ సిలీన్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో "లహరి మ్యూజిక్" ద్వారా విడుదలయ్యింది. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సాగర్, ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. చిత్ర నిర్మాత వరప్రసాద్, సహ నిర్మాత ముద్దం రామచంద్రుడు, రవిరెడ్డి, ఈ చిత్రానికి మాటలు మరియు పాటలు రాసిన శ్రీ సాయి తదిరులు హాజరయ్యారు.
సాగర్ "పంతులు గారి అమ్మాయి" ఆడియోను విడుదల చేసి తొలి సీడీని ప్రసన్నకుమార్ కు అందించారు. శివాజీ హీరోగా రూపొందిన "దొరకడు"తో చిత్ర నిర్మాణం లోకి అడుగుపెట్టిన చంద్రకళా ఆర్ట్ క్రియేషన్స్.. ఆ తర్వాత "దందుపాళ్యమ్ అలజడి" అనే అనువాద చిత్రాన్ని అందించిందని, "పంతులుగారి అమ్మాయి" తమ సంస్థ నుంచి వస్తున్న మూడో చిత్రమని నిర్మాత వరప్రసాద్ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ క్యారెక్టర్ చాలా హై లైట్ గా నిలుస్తుందని సహనిర్మాత ముద్దం రామచంద్రుడు పేర్కొన్నారు. ముఖ్య అతిధులుగా హాజరైన సాగర్,
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. "పంతులు గారి అమ్మాయి" చిత్రానికి మాటలతోపాటు పాటలు రాసే అవకాశం లభించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని శ్రీ సాయి అన్నారు.

More News

న‌న్ను కామెంట్ చేస్తే ప‌ట్టించుకోను. కానీ నా ఫ్యామిలీ మెంట‌ర్స్ ని అంటే మాత్రం త‌ట్టుకోలేను : అన‌సూయ‌

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి...అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ అన‌సూయ‌. సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోట్ అయిన అనుసూయ తాజాగా క్ష‌ణం సినిమాలో న‌టించింది.

బ్రహ్మోత్సవం విడుదల తేదీ...

సూపర్ స్టార్ మహేష్ -శ్రీకాంత్ అడ్డాల సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత కలసి చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం.

నాగ్ ఊపిరి ఆడియో డేట్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

శృతి మించిన శృతిహాస‌న్..

అందం - అభిన‌యంతో ఆక‌ట్టుకున్న అందాల క‌థానాయిక శృతిహాస‌న్. తెలుగు,తమిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకుంది.

నిన్న వ‌ర్మ‌, విష్ణు నేడు సాయి కొర్ర‌పాటి...

ఈగ‌, అందాల రాక్ష‌సి, లెజెండ్, ఊహ‌లు గుస‌గుసలాడే, దిక్కులు చూడ‌కురామయ్య‌...ఇలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించి అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్ననిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం.