'పంతం' ప్రీ రిలీజ్ వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. ఫర్ ఎ కాస్.. ఉప శీర్షిక. ఈ సినిమా జూలై 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.
ఈ కార్యక్రమంలో ..
హీరో గోపీచంద్ మాట్లాడుతూ - `` నాలాంటి హీరోని క్ఇయేట్ చేసింది డైరెక్టర్స్ వారే రియల్ హీరోలు. వాళ్లు ఒక క్యారెక్టర్ అనుకుని దాని ప్రేక్షకులు మెచ్చేలా రాసి ఓ హీరోని క్రియేట్ చేయగల సత్తా ఉన్నది దర్శకులకే. నాతో సినిమా చేసిన దర్శకులందరికీ థాంక్స్. మీరు రాసుకున్న కథలకు నేను సరిపోతానని భావించినందుకు థాంక్స్. మీ అచనాలను నేను రీచ్ అయ్యాననే అనుకుంటున్నాను. నేను 25 సినిమాలు చేశాను. అయితే నా తొలి సినిమా నిర్మాత నాగేశ్వరరావుగారే. ఆయన, సుబ్బయ్యగారు నన్ను ఎంకరేజ్ చేయకపోతే ఈరోజు నేను ఈ ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేవాడిని కాను. నా 25 చిత్రాల జర్నీలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలందరికీ పేరు పేరునా థాంక్స్.
ఇక పంతం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి కారణం రమేశ్ రెడ్డి, ప్రసాద్ మూరెళ్ల. ఓ మంచి కథ నా నుండి దాటి పోకూడదు. నాకైతే చాలా బావుంటుంది. వాళ్లు అనుకుని చక్రిని నా దగ్గరకు తీసుకొచ్చారు. డైరెక్టర్ చక్రి.. తొలి రోజు కథను ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పారో.. అంతే కాన్ఫిడెంట్‌గా సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమాకు డైలాగ్స్ రాసిన రమేశ్ రెడ్డి, శ్రీకాంత్‌గారికి.. కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్లగారితో ఇది నా రెండో సినిమా. ఆయన కెమెరామెన్‌గానే కాదు, అందరికీ పెద్ద దిక్కుగా ఉండి సినిమా చేశారు.. గోపీసుందర్ సూపర్బ్ సాంగ్స్, నేపథ్య సంగీతం అంత కంటే బాగా ఇచ్చారు.. మెహరీన్ ఇంతకు ముందు చాలా మంచి క్యారెక్టర్స్‌లో నటించింది. ఈసినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసింది. .. భాస్కరభట్ల చాలా మంచి సాహిత్యాన్ని ఇచ్చారు... ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌గారికి.. ఎడిటర్ ప్రవీణ్ పూడిగారికి.. ట్రైలర్, టీజర్‌ని కట్ చేసిన ప్రకాశ్‌గారికి.. రాధామోహన్‌గారు జెన్యూన్ ప్రొడ్యూసర్. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
ఆయనకు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి., లౌక్యం తర్వాత నాది, పృథ్వీగారి కామెడీ ట్రాక్ చాలా బాగా నవ్విస్తుంది. శ్రీనివాస్‌రెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, సంపత్ అందిరికీ థాంక్స్. ఈ `పంతం` సినిమా జూలై 5న విడుదలవుతుంది`` అన్నారు.
అమ్మా రాజశేఖర్ మాట్లాడుతూ - `` మనకు తొలి దైవం అమ్మే. తర్వాత నాకు లైఫ్ ఇచ్చిన డాన్స్ మాస్టర్‌కి థాంక్స్. అయితే నాకు చిన్నప్పట్నుంచి డైరెక్టర్ కావాలనేది లక్ష్యం. ఆ అవకాశాన్ని ఇచ్చిన గోపీచంద్‌గారు నాకు దేవుడు. ఓ ట్రెండ్ క్రియేట్ చేయాలంటే డైరెక్టర్ ఎంత కష్టపడాలో తెలుసు. కొత్త కాన్సెప్ట్‌తో కథ చెబితే అంత త్వరగా ఏ హీరో ఒప్పుకోడు. ఎవరూ వినలేదు. గోపీచంద్‌గారు అప్పటి వరకు నన్ను కలవనే లేదు. ఆయన్ను కలసి కథ చెప్పగానే.. అయన వెంటనే అవకాశం ఇచ్చారు. దర్శకుడిని నమ్మే హీరో. ఇక పంతం సినిమాకు కూడా చక్రి అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.
డైరెక్టర్ మోహన్ రాజా మాట్లాడుతూ - `` నేను, నా తమ్ముడు జయం రవి.. మా తండ్రి ఎడిటర్ మోహన్‌గారు.. మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం. గోపీచంద్ గారి తండ్రి టి.కృష్ణగారి రేపటి పౌరులు సినిమాను నాన్నగారు తమిళంలో డబ్ చేశారు. ఆ సినిమా చూసి నేను మోటివేట్ అయ్యి పెరిగాను. సమాజంపై అభిమానంతో పెరిగి పెద్దయిన తర్వాత `తనీ ఒరువన్`లాంటి సినిమా చేయగలిగాను. నా డైరెక్షన్లో తమిళంలో జయం సినిమాలో గోపీ సినిమా చేశాడు. గోపీకి మనస్ఫూర్తిగా థాంక్స్`` అన్నాడు.
డైరెక్టర్ శివ మాట్లాడుతూ - `` నా తల్లిదండ్రులకు నేను ఎంత రుణపడి ఉన్నానో, గోపీచంద్‌గారికి అంతే రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను చాలా చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశాను. డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు చిన్నపాటి టెన్షన్ మనసులో రన్ అయ్యింది. వర్కవుట్ అవుతుందా? అనిపించింది. గోపీచంద్‌గారి ఇంటికి వెళ్లి కథ చెప్పాను. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. ఇప్పుడు నేను స్థాయికి కారణం గోపీచంద్‌గారే కారణం. ఆయన చాలా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ - ``గోపీచంద్‌గారు రష్యాలో చదువుకున్నారు. ఆయన్ను నాగేశ్వరరావుగారు నా వద్దకు తీసుకొచ్చారు. నేను ఆర్టిస్ట్‌ని అవుదామనుకుంటున్నానని తన కోరికను చెప్పాడు. గోపీచంద్ అందంగా ఉన్నాడు, మంచి వాయిస్ ఉంది కాబట్టి నా బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుందనిపి నా బ్యానర్లోనే తొలివలపు సినిమా చేశాను. ఇప్పుడు తన 25వ సినిమా సక్సెస్ఫుల్ కావాలి. రాధామోహన్‌గారు మరిన్ని మంచి సినిమాలు చేయాలి. గోపీచంద్‌గారు ఇలాగే వంద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరెక్టర్ రమణ మాట్లాడుతూ - `` గోపీచంద్‌తో తొలివలపు నుండి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే ఒంటరి సినిమా చేశాను. గోపీచంద్‌గారి తండ్రి టి.కృష్ణగారు విప్లవాత్మక సినిమాలు చేశారు. అలాంటి సోషల్ కాజ్‌తో గోపీచంద్‌గారు సినిమా చేస్తే చూడాలనే కోరిక నాకు ఉండేది. అది పంతంతో నేరవేరింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ - ``నేను రైటర్‌గా ఉండేటప్పుడు కథ రాసుకుని ఏ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో పూరిగారిని కలిశాను. `నీకు ఎలాంటి హీరో కావాలి` అని పూరిగారు అడిగారు. `ఆరడుగులుండాలి. కొడితే పది మంది పడిపోవాలనేలా నా హీరో ఉండాలి` అని ఆయనకు చెబితే.. `నీకు గోపీచంద్ అయితే కరెక్ట్‌గా సరిపోతాడు` అని జగన్‌గారు చెప్పారు. ఆయన నటించిన 25వ సినిమా గుర్తుండిపోయే సినిమా కావాలి. చక్రిగారికి మంచి విజన్ ఉంది. సినిమా పెద్ద విజన్ ఉంది. అందరికీ కనెక్ట్ అయ్యే కనెక్ట్ ఉంది`` అన్నారు.
డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబి) మాట్లాడుతూ - `` చక్రి నా పవర్‌కి ఎంతో కష్టపడ్డాడు.. అలాగే జై లవకుశకి కూడా ఎంతగానో కష్టపడ్డాడు. అలాంటి మా చక్రికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన గోపీచంద్‌గారికి థాంక్స్. ఓ సినిమా ఇవ్వడం అంటే లైఫ్ ఇవ్వడం. కన్న తల్లిదండ్రుల్ని, తొలి సినిమా డైరెక్షన్ అవకాశం ఇచ్చిన హీరోలను మేం ఎప్పటికీ మరచిపోలేం. ఈ కథ తెలుసు. ఓ మంచి సినిమా బయటకు రావాలంటే.. మంచి టీం కుదరాలి. చక్రికి ప్రసాద్ మూరెళ్ల, గోపీసుందర్, భాస్కరభట్ల, మెహరీన్, నిర్మాత రాధామోహన్‌గారి వంటి వారికి థాంక్స్`` అన్నారు.
డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ - ``నేను ఎన్ని సినిమాలు చేసినా.. నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన గోపీచంద్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలను సాధించాయి. భవిష్యత్‌లో ఇలాంటి సినిమాలు మరిన్ని చేస్తాం. మా లక్ష్యం జూలై 5న విడుదలైంది. ఇప్పుడు పంతం కూడా అదే డేట్‌కి విడుదలవుతుంది. చక్రికి ఇది గుర్తుండి పోయే సినిమా కావాలి. గోపీచంద్‌గారు దర్శకుడిని పూర్తిగా నమ్ముతారు. ఆయన ఇలాగే మరింత కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి. నా లక్ష్యం, లౌక్యం సినిమాల కంటే పెద్ద హిట్ కావాలి`` అన్నారు.
సంపత్ నంది మాట్లాడుతూ - ``సత్యసాయి ఆర్ట్స్ నా స్వంత బ్యానర్. నాకు ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలనిచ్చింది. అలాగే చక్రిగారికి కూడా బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. గోపీచంద్‌గారి 25వ చిత్రం ఈ బ్యానర్లో పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుంది. గోపీచంద్‌గారు 25 సినిమాలు చేసినా ఏ మాత్రం పొల్యూట్ కానీ వ్యక్తి. ఇల్లు, ఫ్యామిలీ, షూటింగ్ తప్ప మరే లోకం ఉండదు. ఆయన మిగిలిన 75 సినిమాలను చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ``గోపీతో `గోలీమార్` సినిమా చేశాను. ఆయనతో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాం. మలేషియాలో ప్రతిరోజూ షాపింగ్‌కి వెళ్లేవాళ్లం. గోపీచంద్‌గారు మంచి యాక్టరే కాదు.. మంచి వ్యక్తి కూడా. అందుకే ఈ రోజు దర్శకులందరూ ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చారు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చనిపోతే పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. కష్టం తెలిసిన మనిషి గోపీచంద్. కసితో పెరిగాడు. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడాని నేను రెడీ. రాధామోహన్‌గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. చక్రి తొలి చిత్రం.. యువకుడైన చక్రి తొలి సినిమాతో సక్సెస్ కొట్టి, మా అందరి కంటే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` ఇక సినిమాలో పార్ట్ అయిన మెహరీన్, గోపీసుందర్, ప్రసాద్ సహా అందరికీ అభినందనలు`` అని తెలిపారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``గోపీచంద్‌గారి 25వ సినిమా. మా బ్యానర్లో ప్రెస్టీజియస్‌గా చేశాం. మోస్ట్ అకామడేటింగ్, లవబుల్, కో ఆపరేటివ్ హీరో గోపీచంద్. ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. చక్రి ఓ అనువజ్ఞుడైన డైరెక్టర్లా ఈ సినిమా చేశారు. రమేశ్‌రెడ్డి గారి డైలాగ్స్, ప్రసాద్ మూరెళ్లగారి కెమెరా వర్క్, గోపీ సుందర్‌గారి సంగీతం, ఎ.ఎస్ప్రకాశ్గారి ఆర్ట్, సహా అందరూ తమ వంతు సపోర్ట్ అందించారు. ఈ సినిమా జూలై 5న విడుదలవుతుంది. అందరూ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను`` అన్నారు.
డైరెక్టర్ కె.చక్రవర్తి మాట్లాడుతూ - ``గోపీచంద్‌గారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. ఆయన ల్యాండ్ మార్క్ మూవీ 25వ చిత్రాన్ని నాతో చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఇలాగే వంద సినిమాలు చేస్తాడని, చేయాలని కోరుకుంటున్నాను. జూలై 5న విడుదల కాబోయే ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాలో భాగమై నాకు అండగా నిలిచిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com