Vaisshnav Tej:ఆ గుడి జోలికి వెళ్తే : 'గాలి జనార్థన్ రెడ్డి - సుంకులమ్మ' ఇష్యూను గుర్తుచేసేలా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వినూత్న కథలతో ముందుకు సాగుతున్నారు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతో సాలీడ్ హిట్ అందుకున్న ఆయన.. ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల మార్క్ అందుకున్న ఘనత సాధించారు. ఆ తర్వాత చేసిన కొండ పొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో ఈసారి పక్కా కమర్షియల్ హంగులతో ఆయన ముందుకు వస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ- సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా టైటిల్‌ను రివీల్ చేయలేదు మేకర్స్. తాజాగా సస్పెన్స్‌కు తెరదించుతూ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఆదికేశవ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
గుడిని కాపాడే పాత్రలో వైష్ణవ్ తేజ్ :
ఇక వీడియోలకి వెళితే.. ఓ క్వారీ, అక్కడ జరిగే మైనింగ్‌ను చూపిస్తారు. పూర్తిగా క్వారీని తవ్వేసిన తర్వాత అక్కడే వున్న శివాలయం కూడా కూల్చేసి మైనింగ్ చేయాలని అనుకుంటారు. అప్పుడు ఆ గుడిలో పనిచేసే పూజారి.. ‘‘ ఇంత తవ్వేశారు..ఆ గుడి జోలికి మాత్రం రావొద్దు’’ అని వేడుకుంటాడు. అయితే ఈ ముఠాను హీరో అడ్డుకుని గుడికి రక్షణగా నిలుస్తాడు. ఇందులో వైష్ణవ్ తేజ్ పేరు ‘రుద్ర కాళేశ్వర్ రెడ్డి’’. భారీ ఫైట్లు మాత్రమే చూపించిన ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో మిగిలిన పాత్రలను మాత్రం పరిచయం చేయలేదు. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటులు అపర్ణా దాస్, బోజు జార్జ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో ‘‘ఆదికేశవ’’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సుంకులమ్మ ఆలయాన్ని కూలగొట్టించిన గాలి జనార్థన్ రెడ్డి :
అయితే.. ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తే కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి, సుంకులమ్మ దేవాలయం ఇష్యూ రాజకీయాలు టచ్ వున్నవారికి మైండ్‌లో స్ట్రైక్ అయ్యే వుంటుంది. కొన్నేళ్ల క్రితం గాలి జనార్థన్ రెడ్డి చుట్టూనే ఏపీ, కర్ణాటక రాజకీయాలు తిరిగేవి. బళ్లారి నుంచి బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలను ఆయన కనుసైగతో శాసించేవారు. ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లోని ఓబుళాపురం వద్ద ఆయన చేసిన మైనింగ్ వ్యాపారంతో కోట్ల రూపాయాలు సంపాదించారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలోనే వున్న సుంకులమ్మ ఆలయం తన మైనింగ్‌కు అడ్డుగా వుందనో, లేక మరేదైనా కారణంతోనే గాలి జనార్థన్ రెడ్డి అమ్మవారి ఆలయాన్ని కూలగొట్టించారు. ఈ గుడి జోలికి వెళ్లొద్దని స్థానికులు, ఇతరులు హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆ తర్వాతి నుంచే గాలి పతనం ప్రారంభమైందని కొందరంటారు. మైనింగ్ కోసమే ఆలయాన్ని కూలగొట్టించారని చెప్పినా.. ఆ ఆలయం కింద నిధుల కోసమే జనార్థన్ రెడ్డి ఇలా చేశారనే వాదనలు లేకపోలేదు. మొత్తం మీద వైష్ణవ్ తేజ్ సినిమా కారణంగా మళ్లీ ‘‘సుంకులమ్మ’’ ఇష్యూ తెరపైకి వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com