వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,April 02 2021]

2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో... అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త‌ చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్‌కొట్ట‌గా, విజ‌య్ దుర్గ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు  గిరీశాయకు అందించారు.

ఈ సంద‌ర్భంగా ..

చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెన‌తో యూత్‌కు ద‌గ్గ‌రైన వైష్ణ‌వ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర చేసేంత మంచి క‌థ‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌బోతున్నాం. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.   త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు. 

న‌టీన‌టులు: వైష్ణ‌వ్ తేజ్ పంజా, కేతికా శ‌ర్మ త‌దిత‌రులు

More News

ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్.. పోటీకి టీడీపీ దూరం

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్, మున్సిపల్ పోరు ముగియగానే.. తాజాగా మరో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.

నో కిస్ పాల‌సీపై నివేదా పేతురాజ్ రియాక్షన్ ఇదీ...

‘బ్రోచేవారెవ‌రురా’, ‘చిత్రల‌హ‌రి’, ‘అల వైకుంఠ‌పురంలో..’ లాంటి చిత్రాల్లో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్‌.

ఆ సీన్‌ చూసి పవన్ చప్పట్లు కొట్టారు.. ఎగిరి గంతులేశా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.

‘రాకెట్రీ’ ట్రైలర్ రివ్యూ.. మాధవన్‌ జీవించేశాడుగా..!

ఇస్రో లెజెండ్ నంబి నారాయణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన ఒకరు.

ఏప్రిల్‌ 3న ‘జీ 5’లో ‘సీత ఆన్‌ ది రోడ్‌’ ప్రీమియర్‌

వీక్షకులకు వినోదం అందించడంలో ముందుండే ఓటీటీ వేదిక ‘జీ 5’. కరోనా కాలంలో డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌లు, ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు, పలు చిత్రాలను విడుదల చేయడం ద్వారా తెలుగు ప్రజలకు వినోదం అందించింది.