వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎస్.వి.సి.సి ఎల్ఎల్పి బ్యానర్ కొత్త చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బాపినీడు సమర్పణలో... అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్‌కొట్టగా, విజయ్ దుర్గ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు స్క్రిప్ట్‌ను దర్శకుడు గిరీశాయకు అందించారు.
ఈ సందర్భంగా ..
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెనతో యూత్‌కు దగ్గరైన వైష్ణవ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేసేంత మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించబోతున్నాం. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.
నటీనటులు: వైష్ణవ్ తేజ్ పంజా, కేతికా శర్మ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com