చెర్రీతో పాటు హృతిక్ పేరిట ఉన్న రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసిన వైష్ణవ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ సినిమాతోనే స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. వైష్ణవ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’ చిత్రం ఈ నెల 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డ్‌ని వైష్ణవ్ బీట్ చేసేశాడు. అంతే కాదు.. 21 సంవత్సరాల క్రితం బాలీవుడ్లో హృతిక్ రోషన్ క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటి వరకూ ఏ ఇండస్ట్రీకి చెందిన డెబ్యూ హీరో కూడా టచ్ చేయలేకపోయారు. ఇది కూడా ఒక్క వైష్ణవ్‌కే సాధ్యమైంది.
హృతిక్ రోషన్ హీరోగా పరిచయమైన చిత్రం 'కహో నా ప్యార్ హై'. ఈ చిత్రం అప్పట్లో 5 రోజుల్లో 42 కోట్ల నెట్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 'కహో నా ప్యార్ హై' సినిమా వచ్చి 21 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకూ హృతిక్ పేరిటే ఆ రికార్డ్ ఉంది. కానీ తాజాగా.. వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ 5 రోజుల్లో 43 కోట్ల నెట్ వసూల్ సాధించి.. చరిత్ర సృష్టించింది. దీంతో హృతిక్ 21 ఏళ్ల రికార్డ్‌ను బీట్ చేసి.. వైష్ణవ్ ఆ రికార్డ్‌పై తన పేరును రాశాడు. అలాగే ‘చిరుత’ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాలీవుడ్లో రామ్ చరణ్ ‘చిరుత’ ఇప్పటి వరకూ ఉంది. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 25 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మూడు రోజుల్లో ‘ఉప్పెన’ 28 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. 14 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ‘చిరుత’ రికార్డ్‌ని వైష్ణవ్ మూడు రోజుల్లోనే బ్రేక్ చేసేశాడు. ఇప్పటికీ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఇక వీకెండ్ కూడా వచ్చేస్తోంది. దీంతో ‘ఉప్పెన’ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments