విడుదలైన 'పనిలేని పులిరాజు' ఫస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
ధన రాజ్ హీరోగా ఐదుగురు హీరోయిన్స్ తో పాలెపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న చిత్రం సెప్టెంబర్ మొదటి వారం లో ఆడియో రిలీజ్ చేసుకొని అక్టోబర్ లో విడుదల కానుంది. ఇటివలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా లో విడుదల చేసారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా.....
నిర్మాత సహా నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ "ధన్ రాజ్ మొట్ట మొదటి సారిగా సోలో హీరో గా నటించిన చిత్రమిది. డైలాగ్ కామెడి తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది." అన్నారు.
నిర్మాత నగేష్ కుమార్ మాట్లాడుతూ" సినిమా మేం అనుకున్న దానికన్నా చాలా రెట్లు బాగా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ 'లేడీస్ టైలర్' చిత్రాన్ని తలపించే విధంగా ఈ సినిమా రూపొందించాం. ప్రతి సీన్ పంచ్ లతో నిండి ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని మా గట్టి నమ్మకం" అన్నారు.
చిత్ర దర్శకుడు చాచా మాట్లాడుతూ" కామెడీ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సీన్ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రం అనుకున్న దానికంటే బాగా రావాడానికి కారణమైనా మా టీం అందరికి నా ధన్యవాదాలు" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com