సెన్సార్ లో 'పనిలేని పులిరాజు'
Wednesday, February 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న `పనిలేని పులిరాజు చిత్రానికి దర్శకుడు చాచా. పాలేపు మీడియా పై.లి పతాకంపై పి.వి. నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ `ధన్ రాజ్ సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఫుల్ లెన్త్ కామెడీతో ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రాచీ సిన్హా తో పాటు మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. రఘుబాబు, ధన్ రాజ్ కామెడీ విశేషంగా ఆకట్టుకుంటుంది అన్నారు.
చిత్ర సమర్పకురాలు పి. లక్ష్మి మాట్లాడుతూ `ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
సహ నిర్మాత రవి కె. పున్నం మాట్లాడుతూ `వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలుంటాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో ధన్ రాజ్ 13 పాత్రలు పోషిస్తున్నారు. అన్ని పాత్రలు నవ్విస్తాయి. చిత్రాన్ని మార్చి రెండోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు చాచా మాట్లాడుతూ ` పులిరాజుల వంశంపై వస్తున్న ఈ చిత్రంలో కామెడీతో కూడిన చిన్న సందేశం వుంటుంది అన్నారు.
శ్వేతా వర్మ, ఇషా, హరిణి, సీమ, సరితా కోట, కొండవలస, కోటేశ్వరరావు, సుబ్బారావ్ , డి.వి, శక్తిమాన్, అప్పారావ్, వెంకీ, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: వి.వి. పాటలు: బాలాజీ, కరుణాకర్, లక్ష్మీ నరసింహా, చాచా, డాన్స్: నిక్సన్, కళాధర్, రామారావు, మూల కథ – సహ నిర్మాత: రవి.కె.పున్నం, నిర్మాత: పి.వి.నాగేష్ కుమార్, స్రీన్ ప్లే, దర్శకత్వం: చాచా
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments