'పందెంకోడి 2' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్..లింగుస్వామి దర్శకత్వంలో తనకు బ్రేక్ ఇచ్చిన సినిమా `పందెం కోడి`(సండైకోళి)కి సీక్వెల్‌గా `పందెం కోడి 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `సండైకోళి2` పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ విలన్ పాత్రలో నటిస్తుంది.
దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయాలని విశాల్ ఆలోచిస్తున్నాడు. హీరోగా నటిస్తున్న విశాల్ తన స్వంత బ్యానర్ విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీపై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. లెటెస్ట్‌గా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మరో పక్క పోస్ట్ ఫ్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments