'పాండవుల్లో ఒకడు' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
బ్యానర్- మారుతి టీమ్ వర్క్స్
నటీనటులు- వైభవ, సోనమ్ భాజ్వా, వెంకట్ సుందర్, వి.టి.వి.గణేష్ తదితరులు
ఎడిటర్ – ఆంటోని
సినిమాటోగ్రఫీ – దినేష్ కృష్ణన్
నిర్మాత – మారుతి
రచన, దర్శకత్వం – కార్తీక్ జి.క్రిష్
తమిళ దర్శకుడు శంకర్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంటాడు. అలా ఆయన బ్యానర్ ఎస్ పిక్చర్స్ సమర్పణలో తమిళంలో విడుదలైన చిత్రమే కప్పల్. చిన్న చిత్రంగా అక్కడ విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ కామెడి ఎంటర్ టైనర్ ను మారుతి టీమ్ వర్స్ బ్యానర్ పై మారుతి నిర్మాతగా తెలుగులో విడుదల చేశారు. తెలుగు హీరో అయినప్పటికీ తెలుగులో హిట్ దొరకని వైభవ్ ఇందులో హీరో. పాండవుల్లో ఒకడు అనే టైటిల్ తో తెలుగులో విడుదలైన ఈ సినిమా అసలు విషయం తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...
కథ-
వాసు, సుబ్బరాజు, కార్తీక్, కనకరాజు, పట్టాబి..ఈ ఐదుగురు మంచి స్నేహితులు. తమ ఊర్లోని శీనన్నలు ఈ మిత్రులు ఎంతో ఇష్టపడుతుంటారు. ఓ రోజు మాసిన గడ్డం, బాధలో ఉన్న శీనన్నలు చూసిన ఈ స్నేహితులు అతన్ని కారణం అడుగుతారు. తన చుట్టూ ఉండే స్నేహితులు పెళ్లిళ్లు చేసుకుని తనని విడిచి పెట్టేశారని చెబుతాడు. దాంతో ఈ పాండవులు జీవితంలో పెళ్లి చేసుకోకూడదని ప్రమాణం చేసుకుంటారు. అయితే అమ్మాయిలంటే ఇష్టపడే వాసు తన స్నేహితులకు చెప్పకుండా సిటీకి వచ్చేస్తాడు. సిటీలో దీపిక(సోనమ్ బాజ్వా)ను చూసి ఆమెను ప్రేమిస్తున్నానని వాసు వెంటపడతాడు. ముందు దీపిక ఒప్పుకోకపోయినా చివరకు ప్రేమిస్తుంది. ఇలాంటి సందర్భంలో సిటీకి వెళ్లిన తమ స్నేహితుడు జాడ తెలియకపోవడంతో అతని స్నేహితులు సిటీకి వస్తారు. మరి వాసు ప్రేమ విషయం వారికి తెలిసిందా? వారి రియాక్షన్ ఏంటి? చివరికి వాసు ప్రేమకు శుభం కార్డు పడిందా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సేం..
సమీక్ష-
ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వాసుగా, ప్రమాణం చేసి స్నేహితుల దగ్గర ఇబ్బందులు పడే స్నేహితుడిగా వైభవ్ నటన ఆకట్టుకుంది. అమ్మాయిల వెంటపడే సీన్స్, స్నేహితుల దగ్గర తను లవ్ చేయడం లేదని కంగారు పడే సందర్భాలు, వారు ఇబ్బందలు పెట్టినప్పుడు పడే టెన్షన్ ఈ సీన్స్ లో వైభవ్ చాలా ఈజ్ తో నటించాడు. ఈ సినిమాలో కీ రోల్ తీసుకుని ముందుకు నడిపించాడు. సోనమ్ బాజ్వా నటన, గ్లామర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో నటించిన వారందరూ, వి.టి.వి.గణేష్ సహా మిగిలిన నటీనటులందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు కార్తీక్ క్రిష్ కామెడి పాయింట్ ను డిఫరెంట్ తీసుకుని ఆడియెన్స్ ను నవ్వించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా కామెడి మోతాదు మించినా సినిమా మొత్తం ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ బావుంది. నటరాజన్ శంకర్ ట్యూన్స్ ఆకట్టుకోకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. మంచి ఫీల్ ను క్యారీ చేసేలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా ఫస్టాఫ్ అంతా కామెడితో ఫాస్ట్ సాగిపోతుంది. సెకండాఫ్ కూడా కామెడి ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ లో డోస్ ఎక్కువైపోయిన భావన వస్తుంది.
విశ్లేషణ-
ఓ ఐదుగురు స్నేహితుల మధ్య నడిచే కథను దర్శకుడు కార్తీక్ ఓ ఎంటర్ టైనింగ్ పాయింట్ తో చెప్పడం బావుంది. కామెడి కొన్ని సీన్స్ లో శృతి మించిన భావన తెచ్చినా కథ పరంగా సినిమా బాగుంది. అక్కడక్కడా గందరగోళం, చిన్నప్పుడు హీరో స్నేహితులకు ఉన్న వీక్ పాయింట్స్ పెద్దయిన తర్వాత లేకపోవడం వంటి చిన్నపాటి లాజిక్స్ తప్ప సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. వీటికి దినేష్ సినిమాటోగ్రఫీ, నటరాజన్ శంకర్ సంగీతం ప్లస్ అయింది. మొత్తం మీద నటీనటులతో సంబంధం లేకుండా కామెడి ఎంజాయ్ చేయాలనుకునేవారికి నచ్చే చిత్రమిది.
బాటమ్ లైన్ – అలరించే పాండవుల్లో ఒకడు`
రేటింగ్ -2.75/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com