Panchathantram:‘పంచతంత్రం’ ... మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన తారాగణంగా నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. ది వీకెండ్ షో సమర్పణలో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై హర్ష పులిపాక దర్శకత్వంలో అఖిలేష్ వర్ధన్, స్రుజన్ ఎరబోలు ఈ అంథాలజీని నిర్మించారు.
గత ఏడాది ‘పంచతంత్రం’ను డిసెంబర్ 9న థియేటర్స్‌లో విడుదల చేశారు. అందులో కాన్సెప్ట్స్, నటీనటుల ప్రతిభ, టెక్నీషియన్స్ టేకింగ్ ఆడియెన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మన శరీరంలోని పంచేద్రియాలను జ్ఞాపకాలతో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాలనే పాయింట్‌తో ఈ అంథాలజీని చక్కగా తెరకెక్కించారని, అలాగే ఐదు కథల హృదయ స్పందనగా పంచతంత్రంను రూపొందించారని క్రిటిక్స్ తమ రివ్యూస్ ద్వారా అభినందించారు.
ప్రేమ, భయం, చావు, నమ్మకం, లక్ష్యాలను సాధించటం అనే అంశాలతో వేర్వేరు ఐదు కథల సమాహారంగా ఈ అంథాలజీని రూపొందించారు. ఈ అంథాలజీ మార్చి 22న ఈటీవీ డిజిటల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
నటీనటులు: బ్రహ్మానందం, సముద్ర ఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments