'పంచతంత్రం'లో రామనాథం ఫస్ట్‌లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా... సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామనాథం పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ "సముద్రఖనిగారికి జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప నటుడు, వ్యక్తి మా సినిమాలో నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఓ నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. మరో పది రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం" అని అన్నారు.
ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ "పంచేంద్రియాలు చుట్టూ అల్లుకున్న కథతో సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో సముద్రఖనిగారు రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ ఏడాది 'క్రాక్', అంతకు ముందు 'అల వైకుంఠపురములో' సినిమాల్లో ఆయన పవర్ఫుల్ విలన్‌గా నటించి మెప్పించారు. మా సినిమాలో సముద్రఖని హీరోగా కనిపిస్తారు. 60 ఏళ్ళ రామనాథం పాత్ర, సినిమా చూస్తున్న ప్రతి యంగ్‌స్టర్‌కి తన తండ్రిని గుర్తు చేసేలా ఉంటుంది" అని అన్నారు.
నటీనటులు: ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com