Munugode ByPoll : విధేయతకు పట్టం.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి
Send us your feedback to audioarticles@vaarta.com
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. అంగబలం , అర్ధ బలం వున్న కోమటిరెడ్డిని ఎదుర్కోవాలంటే అంతే బలమైన నేత అవసరం. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సర్వేలు నిర్వహించి మరి అభ్యర్ధిని ఎంపిక చేస్తామని ముందే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున దివంగత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ శనివారం అధికారికంగా ప్రకటించింది.
పల్లె, చలమలకు నిరాశ:
మునుగోడు టికెట్ కోసం కాంగ్రెస్‌లో ఆశావహులు తమదైన శైలిలో ప్రయత్నించారు. ముఖ్యంగా పల్లె రవికుమార్, చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి వైపు మొగ్గుచూపింది. సీనియర్లు కూడా స్రవంతి అభ్యర్థిత్వాన్ని బలపర్చినట్టు సమాచారం. మునుగోడు టికెట్ ఖరారవ్వడంతో స్రవంతికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా:
మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిగ తనకు టికెట్ లభించడం పట్ల పాల్వాయి స్రవంతి హర్షం వ్యక్తం చేశారు. తనపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె స్పష్టం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేందుకు శయశక్తులా కృషి చేస్తానని స్రవంతి హామీ ఇచ్చారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout