Munugode ByPoll : విధేయతకు పట్టం.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి

  • IndiaGlitz, [Friday,September 09 2022]

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. అంగబలం , అర్ధ బలం వున్న కోమటిరెడ్డిని ఎదుర్కోవాలంటే అంతే బలమైన నేత అవసరం. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సర్వేలు నిర్వహించి మరి అభ్యర్ధిని ఎంపిక చేస్తామని ముందే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున దివంగత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ శనివారం అధికారికంగా ప్రకటించింది.

పల్లె, చలమలకు నిరాశ:

మునుగోడు టికెట్ కోసం కాంగ్రెస్‌లో ఆశావహులు తమదైన శైలిలో ప్రయత్నించారు. ముఖ్యంగా పల్లె రవికుమార్, చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి వైపు మొగ్గుచూపింది. సీనియర్లు కూడా స్రవంతి అభ్యర్థిత్వాన్ని బలపర్చినట్టు సమాచారం. మునుగోడు టికెట్ ఖరారవ్వడంతో స్రవంతికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా:

మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిగ తనకు టికెట్ లభించడం పట్ల పాల్వాయి స్రవంతి హర్షం వ్యక్తం చేశారు. తనపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె స్పష్టం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేందుకు శయశక్తులా కృషి చేస్తానని స్రవంతి హామీ ఇచ్చారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

More News

యాక్ట్ చేస్తూ బతకడం రాదు.. కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడ్డ రేవంత్

నిన్నటి ఎపిసోడ్‌లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రాసెస్ ముగిసింది. మొదటి వారం నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్‌, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా,

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూత.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించిన "మహారాజ్ఞి"

బ్రిటన్ రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో క్వీన్ గురువారం రాత్రి

Divyavani : ఈటల రాజేందర్‌తో దివ్యవాణి భేటీ.. త్వరలో బీజేపీలోకి, సౌత్‌లో ఎక్కడైనా రెడీ అంటూ సంకేతాలు

అలనాటి సినీనటి దివ్యవాణి గురువారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈరోజు హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని

ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా: నట్టి కుమార్

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని

ఏం జరిగినా ఇద్దరికీ వర్తిస్తుంది.. ఎలిమినేషన్ కూడా, రోహిత్- మేరీనాలకు షాకిచ్చిన బిగ్‌బాస్

నిన్నటి ఎపిసోడ్‌లో క్లాస్, మాస్, ట్రాష్.. టాస్క్ ముగించిన బిగ్‌బాస్ నామినేషన్లకు తెరదీసిన సంగతి తెలిసిందే.