Pallavi Prashant: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..

  • IndiaGlitz, [Thursday,December 21 2023]

బిగ్‏బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‏ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి గజ్వేల్‏ మండలం కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్‏లో విచారించారు. అనంతరం జడ్జి ఇంట్లో ప్రశాంత్‏తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది.. ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో అర్ధరాత్రి ప్రశాంత్, అతడి తమ్ముడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎవరైనా సరే సెలబ్రెటీల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు.

ఈనెల 17న బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్‏కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకుని 9 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్, ఏ2గా అతడి సోదరుడిని చేర్చారు. ఇప్పటికే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేశారు.

రైతుబిడ్డ ట్యాగ్‌తో కామన్ మ్యాన్‏గా బిగ్‏బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అని చెప్పడంతో చాలా మంది అభిమానులు సపోర్ట్ చేశాడు. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ లో మొత్తానికి విజేతగా నిలిచాడు. గ్రాండ్ ఫినాలే అనంతరం హౌస్ బయటకు వచ్చాక మనోడి విశ్వరూపం బయటపడింది. ఫ్యాన్స్‌తో కలిసి రచ్చ రచ్చ చేయడం.. పోలీసులు పర్మిషన్ లేదన్న పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడం చేశాడు. ఈ క్రమంలో రన్నరప్ అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసి కారు అద్దం పగలగొట్టారు. మరికొంత మంది సెలబ్రెటీస్ కార్లపై దాడులు చేశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ముందుకు సాగాడు. అంతేకాకుండా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పి అతడి ఊరు వద్దకు తీసుకుని వెళ్లాడు. చివరకు రెండు రోజుల పాటు మీడియాను తన వెంట తిప్పించుకుని ఇంటర్వ్యూ ఇవ్వనని ఓవరాక్షన్ చేశాడు. దీంతో రైతుబిడ్డ నిజస్వరూపంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.