పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'పల్లెవాసి'

  • IndiaGlitz, [Wednesday,November 07 2018]

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం పల్లెవాసి.ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. రాకేందు సరసన కల్కి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ వినాయకచవితి సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ అందరినీ ఎట్రాక్ట్ చేసేలా ఉందని ఫీడ్ బ్యాక్ లభించింది. ఆ రెస్పాన్స్ తో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. ముఖ్యంగా సినిమాలో రాకేందు మౌళి నటన అందరి హృదయాలను కట్టిపడేస్తుంది.

సందీప్ అందించిన స్వరాలకు వెన్నెల కంటి, రాకేందు మౌళిల సాహిత్యం చక్కగా కుదిరింది. కథలో భాగంగా వచ్చే పాటలు అందరినీ అలరిస్తాయి. ఇక వేసవి కాలంలో కుండలోని నీరంత చల్లగా..చలి కాలంలో చలి మంటంత వెచ్చగా...కరువు నేలలో పండిన వేరు శనగంత రుచిగా... తొలకరికి నెర్రలు దాచిన నేల పరిమలాంటి అనుభూతి ని 'పల్లెవాసి' కచ్చితంగా కలిగిస్తుందని అన్నారు.

నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవలే షూటింగ్ పూర్తి అయింది. అనుకున్న బడ్జెట్ లో తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయగలిగాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే 'పల్లెవాసి ' ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

More News

జనవరిలో 'మిస్టర్‌ మజ్ను'

యూత్‌కింగ్‌ అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

సమంత, కార్తీ చేతుల మీదుగా 'మధురవాడ' ఫస్ట్ లుక్

కన్నడలో వాసు నాన్ పక్కా కమర్షియల్ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన తెరకెక్కిస్తున్న రెండో సినిమా మధురవాడ.

నవంబర్ 13 న రవితేజ, వి ఐ ఆనంద్, రామ్ త‌ళ్లూరి, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ టైటిల్ లోగో విడుదల

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ప్రొడ‌క్ష‌న్ నెం 3 ని మొద‌లుపెట్ట‌బోతున్నారు.

చైతూకు సమంత కాకుండా ఇంకొకరు కూడానట

అక్కినేని నాగ చైతన్య హీరోగా 'నిన్ను కోరి' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయినా శివ నిర్వాణం దర్శకత్వంలో 'మజిలీ' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే!

చిరంజీవి కూతురు తల్లి కాబోతోంది

మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కు ఆమె స్నేహితుడైన కళ్యాణ్ దేవ్ తోవివాహం జరిగిన విషయం తెలిసిందే. అతిరథ మహారథుల మధ్య ఈ పెళ్లి  2016 మార్చ్ 28న బెంగుళూరు