Bigg Boss 7 Telugu : అశ్వినిని నలిపేసిన అమర్దీప్ .. ప్రశాంత్ కెప్టెన్సీ గోవిందా, రైతుబిడ్డ కంటతడి
Send us your feedback to audioarticles@vaarta.com
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో సందడి పెరిగింది. వీరికి పోటుగాళ్లు అంటూ బిగ్‌బాస్ పెట్టిన పేరు కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యింది. పాతవారితో పోలిస్తే కొత్త వాళ్లు పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. వచ్చీ రాగానే కెప్టెన్సీ టాస్క్‌లో తమ సత్తా ఏంటో చూపించారు. అటు గౌతమ్ కూడా.. సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లొచ్చిన తర్వాత దూకుడు మీద వున్నాడు. ఇక టాస్క్‌ల్లో వెనుకబడిపోవడంతో అమర్దీప్ బాగా డల్ అయ్యాడు. ఈవారం తనను హౌస్ నుంచి పంపేస్తారేమోనంటూ భయపడిపోతున్నాడు. అంతా నిద్రపోయిన తర్వాత దుప్పటి కప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పరిస్థితి అర్ధం చేసుకున్న ప్రిన్స్ యావర్, సందీప్, ప్రియాంకలు అతనిని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు.
ఇక ప్రశాంత్ కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడంటూ బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ బాధ్యతల గురించి చెప్పాల్సిందిగా ఒక్కొక్కరిని ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాలను తెలియజేశారు. చివరికి ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అని ఇంట్లో ఎంతమంది అనుకుంటున్నారో చేతులు పైకెత్తాలని ఆదేశించగా.. అంతా హ్యాండ్స్ రైజ్ చేశారు. ఈ సీన్ చూశాక ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వెంటనే ప్రశాంత్‌ను కెప్టెన్‌గా పీకేసి అతనికి ఇచ్చిన బ్యాడ్జ్‌ని తిరిగి తీసుకుంటున్నట్లుగా బిగ్‌బాస్ ప్రకటించాడు. ఎవరు విమర్శించినా, విసుక్కున్నప్పటికీ.. తనను ఎంతో సపోర్ట్ చేసిన శివాజీ కూడా చేయి పైకెత్తేసరికి ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు.
కెప్టెన్సీ టాస్క్‌లో ఆటగాళ్లు, పోటుగాళ్లు మధ్య ఎవరు ఫిట్టెస్ట్, ఎవరు జీనియస్ అంటూ రెండు పోటీలు జరిగాయి. ఈ రెండింట్లోనూ పోటుగాళ్లే గెలిచి రెండు పాయింట్స్ సంపాదించి మంచి ఊపులో వున్నారు. ఇక మూడో టాస్క్ కింద ‘‘హౌ ఈజ్ ది ఫాస్టెస్ట్’’ అనే ఛాలెంజ్ విసిరాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా బిగ్‌బాస్ చెప్పిన రంగు వున్న ఏదైనా వస్తువు తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో మార్క్ చేసి వుంచిన ప్లేస్‌లో వేయాలి. ఇందులో ఆటగాళ్ల నుంచి ఒకరు, పోటుగాళ్ల నుంచి మరొకరు రావాలి. ఎవరు ఫాస్ట్‌గా తీసుకొస్తే వారే విజేత. బాగా డిజప్పాయింట్‌లో వున్నప్పటికీ ఆటగాళ్ల నుంచి అమర్దీప్, పోటుగాళ్ల నుంచి అశ్విని శ్రీ వచ్చారు.
ఈ క్రమంలో అమర్దీప్ చేతికి స్పూన్ ఇచ్చి స్విమ్మింగ్ పూల్‌ని ఖాళీ చేయమని చెప్పగా.. ఇది నవ్వులు పూయించింది. ఈ సమయంలో అశ్విని నుంచి వస్తువులు లాక్కొనేందుకు ఆమె మీదకు దూసుకెళ్లాడు అమర్దీప్. దీంతో అతనిని బిగ్‌బాస్ మందలించాడు. ఎలాగోలా ఈ టాస్క్‌లో ఆటగాళ్లు గెలిచారు. తర్వాత ‘హౌ ఈజ్ స్ట్రాంగెస్ట్’ అని మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా రెండు వైపులా వున్న రాకెట్స్‌ని కింద పడిపోకుండా పట్టుకోవాలి. ఈ టాస్క్‌లో పోటుగాళ్ల నుంచి అర్జున్, ఆటగాళ్ల నుంచి ప్రిన్స్ యావర్ పాల్గొన్నారు. వీరిద్దరిలో ఎక్కువసేపు రాకెట్స్‌ని పట్టుకుని అర్జున్ గెలిచాడు. అలా నాలుగు టాస్క్‌ల్లో మూడింటిని గెలిచిన పోటుగాళ్లు .. కెప్టెన్సీ పోటీలో నిలిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments