Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) జైలు నుంచి విడుదలయ్యాడు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి బయటకు రాగానే మీడియా కంట కనపడకుండానే వెళ్లిపోయాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులు సూచనలను బేఖాతరు చేసినందుకు గాను పోలీసులు నాలుగు రోజుల క్రితం అతడిని అరెస్ట్ చేశారు.న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.
ప్రశాంత్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ జైలు అధికారులకు బెయిల్ ఉత్తర్వులు అందడంతో బయటకు విడుదల చేశారు. మీడియాతో మాట్లాడకూడదని.. ఎక్కడా మీటింగ్‌లు నిర్వహింంచుకూడదని ఆదేశించింది. దీంతో సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే జైలు నుంచి విడుదలైన ప్రశాంత్.. ప్రతి నెల 1, 16వ తేదీల్లో జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపింది. ఎట్టకేలకు ప్రశాంత్ జైలు నుంచి విడుదల కావడంతో బిగ్‌బాస్ కంటెంస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈనెల 17న బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్‌కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని కార్లపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పినా తమ మాట వినకుండా అభిమానులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడని ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు మొత్తం 9 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్, ఏ2గా అతడి సోదరుడిని చేర్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout