Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల

  • IndiaGlitz, [Saturday,December 23 2023]

బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 విజేత పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth) జైలు నుంచి విడుదలయ్యాడు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి బయటకు రాగానే మీడియా కంట కనపడకుండానే వెళ్లిపోయాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులు సూచనలను బేఖాతరు చేసినందుకు గాను పోలీసులు నాలుగు రోజుల క్రితం అతడిని అరెస్ట్ చేశారు.న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

ప్రశాంత్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ జైలు అధికారులకు బెయిల్ ఉత్తర్వులు అందడంతో బయటకు విడుదల చేశారు. మీడియాతో మాట్లాడకూడదని.. ఎక్కడా మీటింగ్‌లు నిర్వహింంచుకూడదని ఆదేశించింది. దీంతో సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే జైలు నుంచి విడుదలైన ప్రశాంత్‌.. ప్రతి నెల 1, 16వ తేదీల్లో జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపింది. ఎట్టకేలకు ప్రశాంత్ జైలు నుంచి విడుదల కావడంతో బిగ్‌బాస్ కంటెంస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈనెల 17న బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్‏కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని కార్లపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పినా తమ మాట వినకుండా అభిమానులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడని ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు మొత్తం 9 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్, ఏ2గా అతడి సోదరుడిని చేర్చారు.

More News

CM Revanth Reddy:ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని

AA Creations RK Cinema:లాంఛనంగా ప్రారంభమైన AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం

వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1

Ankura Hospital:హైదరాబాద్‌లోని అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్‌లోని అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

JD Lakshminarayana:జేడీ లక్ష్మీనారాయణ.. మరో జేపీ అవుతారా..? కేజ్రీవాల్ అవుతారా..?

ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించడం సులభం. కానీ ఆ పార్టీని విజయవంతంగా

Chandrababu, Prashant Kishore:షాక్‌లో సీఎం జగన్.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ..

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో