Bigg Boss 7 Telugu : గాడిలో పడ్డ అమర్దీప్ .. రైతుబిడ్డకు మళ్లీ కెప్టెన్‌గా ఛాన్స్ , శోభను ఏడిపించిన పూజ సామెత
Send us your feedback to audioarticles@vaarta.com
వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో జోష్ పెరిగింది. టాస్క్‌ల్లోనూ, స్ట్రాటజీలోనూ వీరు సూపర్ అనిపించుకుంటున్నారు. వచ్చీ రావడంతోనే సెకండ్ కెప్టెన్సీ కంటెండెర్స్‌గా అర్హత సాధించారంటే వీరి సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక హౌస్‌లో అమర్దీప్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏ టాస్క్‌ల్లోనూ సత్తా చూపలేకపోవడం, ప్రతీసారి బకరా అవుతూ వుండటంతో ఆయనకు ఎలిమినేషన్ భయం పట్టుకుంది. ఈవారం ఇంటికెళ్లేది నేనే అంటూ కనిపించిన వారికల్లా చెప్పుకుంటున్నాడు.
కానీ ఈరోజు మాత్రం అమర్దీప్ విశ్వరూపం చూపించాడు. హౌస్‌లో ఎవరు స్మార్ట్ అంటూ ఆటగాళ్లు, పోటుగాళ్ల మధ్య బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ అడిగిన ప్రశ్నలకు రెండు జట్ల నుంచి ఒక్కొక్కరు వచ్చి సమాధానం ఇవ్వాలి. ఈ ప్రశ్నలకు అక్కడ కార్డులపై వున్న బొమ్మల్లో ఆన్సర్ వుంటుంది. కరెక్ట్ బొమ్మని తీసుకుని ఎవరైతే ముందుగా బోర్డుపై పెడతారో వారి ఓ పాయింట్ లభిస్తుంది. ఎక్కువగా సినిమా నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలే వుండటంతో అమర్దీప్ రెచ్చిపోయాడు. సందీప్ కూడా జోరు మీద వుండటంతో ఆటగాల్లు టీమ్ ఈ టాస్క్‌లో విజయం సాధించింది.
మరోవైపు.. కెప్టెన్‌గా బాధ్యతగా వ్యవహరించడం లేదుంటూ పల్లవి ప్రశాంత్‌ను తప్పించిన బిగ్‌బాస్ అతనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇంటిలో కెప్టెన్ అనేవాడు ఎలా నడుచుకోవాలో ఒక పాఠం నేర్పేందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని.. తిరిగి మళ్లీ నీకు కెప్టెన్‌గా అవకాశం ఇస్తున్నానని స్పష్టం చేశాడు. నిన్నంతా ఏడుపు మొఖంతో దిగాలుగా కనిపించిన రైతుబిడ్డకు బిగ్‌బాస్ నిర్ణయంతో ఎక్కడా లేని సంతోషం కనిపించింది. ఈసారి తన కెప్టెన్సీలో ఎలాంటి లోపం వుండదని.. రెండోసారి ఛాన్స్ ఇచ్చినందుకు బిగ్‌బాస్‌కు ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు.
స్మార్ట్ గేమ్ ముగిసిన తర్వాత ఫోకస్డ్ టాస్క్‌ను ఇచ్చారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా కంటెస్టెంట్స్ బెలూన్ను బౌన్స్ చేస్తూ తాము సెలక్ట్ చేసుకున్న కలర్ బాల్స్‌ను బుట్టలో వేయాలి. ఈ టాస్క్‌లోనూ ఆటగాళ్లు విజయం సాధించారు. ఎవరు స్మార్ట్ టాస్కులో పూజాతో శోభా శెట్టి గొడవ పెట్టుకుంది. బిగ్‌బాస్ ప్రశ్న అడిగిన సమయంలో అర్జున్ .. పూజాకు సాయం చేశాడంటూ శోభా ఆరోపించింది. దీనిని పూజా ఖండించింది. ప్రతీదానికి ఇలాగే వాదిస్తావంటూ ఫైర్ అయ్యింది. నేను చూశాను కాబట్టే చెబుతున్నానని శోభా సమర్ధించుకుంది. గొడవ సద్దమణిగిన తర్వాత వెళ్తూ వెళ్తూ.. నువ్వు చేస్తే నీతులు, నేను చేస్తే బూతులు అని శోభాను ఉద్దేశించి ఓ సామెత చెప్పింది. ఈ మాట శోభా చెవిలో పడటంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com