Amardeep: అన్నపూర్ణ వద్ద ఘర్షణ .. అమర్‌పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి, ఆ లేడి కంటెస్టెంట్ కారు అద్దాలు ధ్వంసం

  • IndiaGlitz, [Monday,December 18 2023]

15 వారాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 తెలుగు ముగిసింది. అందరిని షాక్‌కు గురిచేస్తూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి, బిగ్‌బాస్ చరిత్రలో టైటిల్ గెలిచిన సామాన్యుడిగా రికార్డుల్లోకెక్కాడు. అయితే కప్ కొడతాడని భావించిన సీరియల్ నటుడు అమర్‌దీప్ చౌదరి రన్నరప్‌గా నిలిచాడు. దీనిని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫినాలే ముగిసిన తర్వాత అమర్ అభిమానులు, ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలో అమర్ కారుతో పాటు మరో ఇద్దరు సెలబ్రెటీలు కారు అద్దాలు, ఆర్టీసీ బస్సు అద్దాలను వారు ధ్వంసం చేశారు.

ఫినాలే ముగిసిన తర్వాత అమర్‌దీప్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుండగా ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనుకవైపు అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేసే గీతూ రాయల్‌ కారుని కూడా వదల్లేదు. ఆపై అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ గొడవకు దిగి కొట్టుకున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.

అయితే ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్‌కు వీరాభిమానులు కొందరు తయారవుతూ వుంటారు. వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. గతంలో కౌశల్ మందా అభిమానులు రెచ్చిపోయారు. కౌశల్ ఆర్మీ పేరుతో ఇతర కంటెస్టెంట్స్‌ను, వారి అభిమానులను వేధించేవారు. ఇప్పుడు కూడా ప్రశాంత్ అభిమానులు.. అమర్ కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. అయితే వాళ్లు గట్టిగా నిలబడటం, ఇతర సెలబ్రిటీలు మద్ధతుగా వుండటంతో పిచ్చి ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు.

More News

Chandrababu-Lokesh:అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్.. అక్కడే పాదయాత్ర ముగింపు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యాత్రను ముగించనున్నారు.

Pawan Kalyan:పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి.

bigg boss 7 Telugu : బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ .. కాలర్ ఎగరేసిన రైతుబిడ్డ , కప్పుతో సగర్వంగా ఇంటికి

బిగ్‌బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన ప్రశాంత్ విజేతగా నిలిచినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

CM Revanth Reddy:బీఆర్ఎస్ సభ్యులకు ఇదే నా శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదం చర్చలో కాంగ్రెస్-బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి.

Ayodhya Rama Mandira:అయోధ్య రామమందిర ప్రతిష్ట.. 100 రోజులు.. 1000 రైళ్లు..

వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది.