bigg boss 7 Telugu : బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ .. కాలర్ ఎగరేసిన రైతుబిడ్డ , కప్పుతో సగర్వంగా ఇంటికి

  • IndiaGlitz, [Monday,December 18 2023]

బిగ్‌బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన ప్రశాంత్ విజేతగా నిలిచినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అంతేకాదు.. బిగ్‌బాస్ చరిత్రలో టైటిల్ గెలిచిన సామాన్యుడిగా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. విజేతగా అతడికి రూ.50 లక్షల నగదు, మారుతి కారు, 15 లక్షల విలువైన బంగార నెక్లెస్‌ గెలుచుకోగా.. అమర్‌దీప్ చౌదరి రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ 7 తెలుగు ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభమై మొత్తం 105 రోజుల పాటు సాగింది. తొలి రోజు 14 మంది , 35వ రోజున ఐదుగురు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఆరుగురు పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలిచారు. వీరిలో ప్రేక్షకుల ఆమోదం పొందిన ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు జరిగిన ఆరు తెలుగు బిగ్‌బాస్ సీజన్‌లలోనూ పలువురు కంటెస్టెంట్స్ కామన్ మాన్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో ఎవరూ ప్రశాంత్‌కు వున్న స్థాయిలో పాపులారిటీని సంపాదించుకులేకపోయారు. అలాంటిది మొదటిసారిగా ఓ కామన్‌మాన్ అది కూడా ఓ రైతు బిడ్డ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అంతేకాదు.. కష్టపడితే ఎవరైనా ఈ స్థాయికి చేరుకోవచ్చని పల్లవి ప్రశాంత్ నిరూపించాడు.

వ్యవసాయమే జీవనాధారంగా బతికే ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన పల్లవి ప్రశాంత్ తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి తాము ప్రతిరోజే ఏం చేస్తాం.. తన వూరు, పొలం పనులు వంటి వాటి గురించి వీడియోలు చేసేవాడు. ఆపై ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యాడు. 555కే ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాడు. అన్నా .. రైతుబిడ్డని అన్నా.. మళ్లొచ్చినా అంటూ పలకరించే పల్లవి ప్రశాంత్ అదే డైలాగ్‌తో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో మనోడి చూపు బిగ్‌బాస్‌పై పడింది. దీంతో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టాడు. అయినప్పటికీ పని మాత్రం జరగలేదు. అయితే బుర్రకు పదునుపెట్టి బిగ్‌బాస్ రీల్స్, వీడియోలను వైరల్ చేశాడు. తనకు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం కల్పించాలని ప్రశాంత్ ప్రాధేయపడ్డాడు.

ఎట్టకేలకు బిగ్‌బాస్ నిర్వాహకుల కంట్లో పడటంతో ఈ సీజన్‌లో సామాన్యుడి కోటాలో ప్రశాంత్‌కు అవకాశం కల్పించారు. హౌస్‌లో సీనియర్ నటుడు శివాజీకి శిష్యుడిగా మనోడు దూసుకెళ్లిపోయాడు. శివాజీ ఫ్యాన్స్‌తో పాటు ప్రశాంత్‌కు సొంతంగా వున్న ఫాలోవర్స్ ఓట్లు తనకే పడటంతో ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. చివరిలో అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శివాజీ వంటి సెలబ్రెటీలను పక్కకునెట్టి పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్ 7 తెలుగు టైటిల్ విజేతగా నిలిచి రైతుబిడ్డలందరూ గర్వపడేలా చేశాడు.

More News

CM Revanth Reddy:బీఆర్ఎస్ సభ్యులకు ఇదే నా శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదం చర్చలో కాంగ్రెస్-బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి.

Ayodhya Rama Mandira:అయోధ్య రామమందిర ప్రతిష్ట.. 100 రోజులు.. 1000 రైళ్లు..

వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది.

Purandeshwari:జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

Akbaruddin:వైయస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగింది: అక్బరుద్దీన్

ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించలేకపోయాయని ఎంఐఎం ఎమ్మెల్యే

Revanth Reddy-KTR:అసెంబ్లీలో ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. గవర్నర్‌కు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్,