స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు ఎంపికైన పలాష్ తనేజా
Send us your feedback to audioarticles@vaarta.com
ఆపిల్ ప్రపంచ వ్యాప్త డెవలపర్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2020 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు 19 ఏళ్ల పలాష్ తనేజా ఎంపికయ్యాడు. 41 దేశాలతో పాటు ప్రాంతాల నుంచి ఈ అవార్డుకు 350 మంది ఎంపికవగా వారిలో న్యూ ఢిల్లీకి చెందిన పలాష్ ఒకడు. అతను ఒక స్విఫ్ట్ ప్లేగ్రౌండ్‌ను సృష్టించాడు. ఇది జనాభాలో ఒక మహమ్మారి కదలికను అనుకరించే సమయంలో కోడింగ్ నేర్పుతుంది. అలాగే.. సామాజిక దూరం, మాస్కులు ఎలా మహమ్మారి వ్యాప్తి రేటును అరికట్టేందుకు ఎలా సహాయపడతాయో చూపిస్తుంది.
పలాష్ టెక్సాస్ యూనివర్సిటీలో ప్రథమ సంవత్సరం పూర్తి చేశాడు. గతంలో తాను డెంగ్యూతో బాధపడ్డానని అదే ఈ వ్యాధి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి తనను ప్రేరేపించిందని తెలిపాడు. అయితే పలాష్ స్విఫ్ట్ ప్లే గ్రౌండ్ మాత్రమే కాకుండా.. డెంగ్యూ జ్వరం వంటి దోమల ద్వారా సోకే వ్యాధుల వ్యాప్తిని అంచనా వేయడానికి వెబ్ ఆధారిత సాధనాన్ని కూడా సృష్టించాడు. కాగా.. డేవ్ జా అనే భారతీయ సంతతికి చెందిన విద్యార్థి కూడా ఈ అవార్డును గెలుచుకున్నాడు. సామాజిక దూరానికి సంబంధించిన ప్రయోజనాలను వివరించే కోవిడ్ 19 సిమ్యులేటర్‌ను రూపొందించినందుకు డేవ్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డును గెలుచుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout