స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు ఎంపికైన పలాష్ తనేజా

  • IndiaGlitz, [Thursday,June 18 2020]

ఆపిల్ ప్రపంచ వ్యాప్త డెవలపర్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2020 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు 19 ఏళ్ల పలాష్ తనేజా ఎంపికయ్యాడు. 41 దేశాలతో పాటు ప్రాంతాల నుంచి ఈ అవార్డుకు 350 మంది ఎంపికవగా వారిలో న్యూ ఢిల్లీకి చెందిన పలాష్ ఒకడు. అతను ఒక స్విఫ్ట్ ప్లేగ్రౌండ్‌ను సృష్టించాడు. ఇది జనాభాలో ఒక మహమ్మారి కదలికను అనుకరించే సమయంలో కోడింగ్ నేర్పుతుంది. అలాగే.. సామాజిక దూరం, మాస్కులు ఎలా మహమ్మారి వ్యాప్తి రేటును అరికట్టేందుకు ఎలా సహాయపడతాయో చూపిస్తుంది.

పలాష్ టెక్సాస్ యూనివర్సిటీలో ప్రథమ సంవత్సరం పూర్తి చేశాడు. గతంలో తాను డెంగ్యూతో బాధపడ్డానని అదే ఈ వ్యాధి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి తనను ప్రేరేపించిందని తెలిపాడు. అయితే పలాష్ స్విఫ్ట్ ప్లే గ్రౌండ్ మాత్రమే కాకుండా.. డెంగ్యూ జ్వరం వంటి దోమల ద్వారా సోకే వ్యాధుల వ్యాప్తిని అంచనా వేయడానికి వెబ్ ఆధారిత సాధనాన్ని కూడా సృష్టించాడు. కాగా.. డేవ్ జా అనే భారతీయ సంతతికి చెందిన విద్యార్థి కూడా ఈ అవార్డును గెలుచుకున్నాడు. సామాజిక దూరానికి సంబంధించిన ప్రయోజనాలను వివరించే కోవిడ్ 19 సిమ్యులేటర్‌ను రూపొందించినందుకు డేవ్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డును గెలుచుకున్నాడు.

More News

నా కూతురి ఆత్మహత్య కేసులో సల్మాన్ ప్రమేయం ఉంది: జియాఖాన్ తల్లి

బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యోదంతం పలు వివాదాలకు కారణమవుతోంది.

ఏపీలో 400 మార్క్‌ను దాటేసిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకూ 200 మార్క్ దాటని కరోనా కేసులు..

పూన‌మ్ సెన్సేషనల్ ట్వీట్స్.. టార్గెట్ ఎవరు?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ద‌క్షిణాదిన కూడా ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.

రీ రికార్డింగ్ దశలో యాక్షన్ అండ్ సోషియో థ్రిల్లర్ మూవీ  'క్లూ'

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల  విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.

పూరి స్క్రిప్ట్ చేంజ‌స్ చేస్తున్నాడా?

పూరి కొన్ని విష‌యాల్లో చాలా నిక్క‌చ్చిగా ఉంటాడు. ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ అయిన త‌ర్వాత మార్పులంటే ఎవ‌రు చెప్పినా విన‌డు.