పలాస దర్శకుడి వెబ్ సిరీస్..!

  • IndiaGlitz, [Saturday,June 27 2020]

తొలి చిత్రం ‘ప‌లాస 1978’ సినిమాతో అటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు క‌రుణ కుమార్‌. ఈ సినిమా సక్సెస్‌తో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఓకే చేయించేసుకున్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు క‌రుణ కుమార్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రాజశేఖర్‌తో చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపించాయి. అయితే అలాంటివేమీ లేద‌ని ద‌ర్శ‌కుడు రీసెంట్‌గా ఓ ప‌త్రిక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ప్ర‌స్తుతం ఆయ‌న రైట‌ర్ క‌దిర్‌బాబు ర‌చించిన షార్ట్ స్టోరీస్‌ను ఆధారం చేసుకుని ల‌స్ట్‌స్టోరీస్ త‌రహాలో తెలుగులో ఓ సినిమాను చేయ‌బోతున్నాడు. తెలుగు ఓటీటీ ఆహా కోసం ఈ వెబ్ సిరీస్‌ను క‌రుణ కుమార్ తెర‌కెక్కించ‌నుండ‌టం విశేషం

అలాగే త‌న రెండో చిత్రం గురించి క‌రుణ కుమార్ మాట్లాడుతూ ‘‘అల్లు అర‌వింద్‌గారికి ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే సాయితేజ్, సుధీర్‌బాబుల‌ను క‌లిసి క‌థ‌ల‌ను వినిపించాను. అలాగే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ వారికి కూడా క‌థ చెప్పాను. మ‌రికొంత మంది నిర్మాత‌లు న‌న్ను క‌లిశారు. ఎవ‌రితో రెండో సినిమా చేస్తానో ఇప్పుడే చెప్ప‌లేను’’ అన్నారు.

More News

మ‌రో హిస్టారిక్ మూవీ ఘాజీ ద‌ర్శ‌కుడు

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు.

టీవీ పరిశ్రమలోని ఆ 33 మంది కరోనా ఫలితం వచ్చేసింది..

లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే షూటింగ్‌లకు సిద్ధమైన టీవీ పరిశ్రమకు నటుడు ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో షాక్ తగిలనట్టైంది.

ఢిల్లీ - గురుగ్రామ్ సరిహద్దుల్లో మిడతల దండు..

ఓ పక్క కరోనా దేశాన్ని కుదిపేస్తుంటే.. మరోపక్క మిడతల దండు భయాందోళనకు గురి చేస్తోంది.

కీలక నిర్ణయం తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ మరణించి 13 రోజులైన సందర్భంగా ‘గుడ్‌బై సుశాంత్’ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది

దాసరి ఆస్తి వివాదంలో చిరంజీవి.. వివరణ ఇచ్చిన అరుణ్

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుల మధ్య ఆస్తి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్న విషయం తెలిసిందే.