ఎయిర్‌ఫోర్స్ దెబ్బకు తోకముడిచిన పాక్ విమానాలు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకోటలో జరిగిన ఉగ్రమూకల పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో అటు పాక్.. ఇటు ఉగ్రవాదులు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో బుధవారం ఉదయం భారత్ గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి.
రాజోరి, నౌషేరా సెక్టార్లలోకి పాక్ యుద్ధవిమానాలు ప్రవేశించగా.. పసిగట్టిన భారత వైమానిక దళం వాటిని తిప్పి కొట్టింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దెబ్బకు పాక్ విమానాలు పరుగులు తీశాయి. ఈ క్రమంలో పాక్ విమానాలు పలు ప్రాంతాల్లో బాంబులు జారవిడిచాయి. కాగా సర్జికల్ స్ట్రైక్స్‌కు రివెంజ్ తీర్చుకుంటామని పాక్ భద్రత దళాల అధికారి ఆసిఫ్ గఫూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇవాళ ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ఘటనాస్థలిలోనే హతమయ్యారు. కాగా ఆ ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ కాల్పుల్లో భారత సైన్యానికి గానీ.. పౌరులకుగానీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout