భారత్ పైలట్‌‌ను కొట్టి.. ఫొటోలు విడుదల చేసిన పాక్

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

భారత్‌‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని భద్రతాదళాల అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ బుధవారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇవన్నీ కట్టుకథలే అని పాక్ పచ్చి అబద్ధాలు చెబుతోందని అందరూ భావించారు. అరగంట ముందు మీడియాతో మాట్లాడిన మన అధికార ప్రతినిధి రవీశ్‌‌కుమార్ భారత్ ఫైలట్ తప్పిపోయిన మాట నిజమేనని స్పష్టం చేశారు. దీంతో పాక్ చెరలో మన పైలట్ ఉన్నాడని తెలిసింది. ఆ తర్వాత పాక్ ప్రధాని మీడియా ముందుకొచ్చి రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని.. ఇద్దరు పైలెట్లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.

అయితే తాజాగా ఆ పైలట్‌‌ విక్రమ్ అభినందన్‌ ఫొటోలను పాక్ విడుదల చేసింది. కాగా అంతకముందు ఓ వీడియోను కూడా పాక్ లీక్ చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌గా అభినందన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సర్వీస్ నెంబర్ 2791 అని అభినందన్‌‌ పాక్ అధికారులు స్పష్టం చేశారు. కాగా విక్రమ్ ముఖంపై తీవ్రగాయాలున్నట్లు ఫోటోను బట్టి చూస్తే తెలుస్తోంది. పైలట్‌ అభినందన్‌‌పై దాడి చేస్తున్నట్లు వీడియోలు బయటికొచ్చాయి. ఆయన పాక్‌ ఆర్మీకి దొరకగానే కొట్టి తీవ్రంగా హింసిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. మిగ్-21 కూలిపోయినప్పుడు ప్యారాచూట్ ద్వారా అభినందన్ కిందికి దిగాడు. ప్రస్తుతం పైలెట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందాన్ని ఉల్లఘించిన పాక్ పైలట్‌‌ను చిత్రహింసలకు గురిచేసింది.

అభినందన్‌కు సంబధించిన వివరాలు..
అభినందన్ స్వస్థలం కేరళలోని తాంబరం అని తెలిసింది. అభినందన్ తండ్రి ఎయిర్ మార్షల్‌‌గా పనిచేశారు. ప్రస్తుతం తాంబరంలోని ఐఏఎఫ్ అకాడమీలో అభినందన్ ఉంటున్నారు. విషయం తెలుసుకున్న అభినందన్ కుటుంబీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. టీవీల్లో వార్తలు చూసిన విక్రమ్ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

More News

'మేజ‌ర్‌' అవుతున్న అడివిశేష్

ఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు

భారత్ పైలట్ తప్పిపోయిన మాట నిజమే..

భారత్ ఫైలట్ తప్పిపోయిన మాట నిజమేనని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అధికారులు.. పాక్ చెబుతున్న పచ్చి అబద్ధాలను అధికారులు తిప్పి కొట్టారు.

యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో తెలీదు: పాక్ ప్రధాని

గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తోక ముడిచిన పాకిస్థాన్ తిక్క కుదిరినట్లుంది. అందుకే భారత్‌‌తో చర్చలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.

వైసీపీ లో చేరిన దగ్గుపాటి, ఆమంచి

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుపాటి హితేశ్ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

సర్జికల్ స్ట్రైక్స్ వీడియోస్‌‌పై క్లారిటీ వచ్చేసింది..

పాక్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌‌లో ఉగ్రవాదుల స్థావరం కుప్పకూలిన సంగతి తెలిసిందే.