ఇన్నాళ్లు బుకాయించి.. నిజం ఒప్పేసుకున్న పాక్!

  • IndiaGlitz, [Tuesday,April 02 2019]

ఉగ్రమూకలను అంతమొందించేందుకు బాలకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసి సుమారు 300మందిని మట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఎఫ్‌–16 విమానాలను వినియోగించి పాక్ పైత్యం ఏంటో తెలియజేసింది. అయితే దీన్ని పసిగట్టిన భారత్.. పాక్‌‌కు ముచ్చెమటలు పట్టించి మిగ్-21తో వెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఆ పాక్ విమానాన్ని కూల్చేశారు.

అయితే ఈ విషయం బయటికి తెలిస్తే దేశం పరువుపోతుందని భావించిన పాక్ తాము ఎఫ్-16 వినియోగించలేదని ఇన్ని రోజులూ చెప్పుకొచ్చింది. వాస్తవాన్ని దాచి అబద్ధాన్ని అల్లిన పాక్ బాగోతం ఎట్టకేలకు బయటపడింది. అవును.. తమ ఎఫ్‌–16 యుద్ధ విమానాలే భారత్‌ విమానాలను కూల్చేశాయని ఫస్ట్ టైం నోరు విప్పి వాస్తవాన్ని బయటపెట్టింది.

ఇదీ అసలు కథ..

ఎఫ్-16 యుద్ధ విమానాలను పలు షరతులతో అమెరికా దేశం పాక్‌కు విక్రయించింది. అది కూడా కేవలం ఉగ్రవాద నిరోధానికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. అయితే పాక్ మాత్రం భారత్‌పై వాడటంతో ఈ ఎఫ్-16కు సంబంధించిన వివరాలు, వివరణ ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. అప్పుడిక చేసేదేమీ లేక నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. కాగా.. ఫిబ్రవరి 27న ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుందని.. మా వద్ద ఉన్న ఎఫ్‌–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్‌ కూల్చలేదని పాక్ ఎయిర్‌ఫోర్స్ అధికారి గఫూరే ప్రకటించిన సంగతి తెలిసిందే.

పాక్ ఇప్పుడు ఏమంటోంది..!

పదే పదే అమెరికా వివరణ ఇవ్వాలని కోరుతుండటంతో ఎట్టకేలకు నిజం బయటపెట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి పాక్ మేజర్ ఓ ప్రకన విడుదల చేశారు. అవును.. మా ఎఫ్-16 యుద్ధ విమానాలే భారత మిగ్‌ను కూల్చివేశాయి. ఫిబ్రవరి 27న నియంత్రణ రేఖ వెంబడి తమ గగన తలం నుంచే దాడులు చేశాము. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్-16 విమానాలు కూడా ఉన్నాయి అని పాక్ నోట నిజం వచ్చేసింది. కాగా.. ఈ విషయంలో పాక్‌పై అమెరికా ఎలా స్పందిస్తుంది..? ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

ఔటర్‌రింగ్‌ రోడ్డు పై 'టోల్‌' తీస్తున్నారుగా!

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) వాహనదారులకు అప్పుడప్పుడు సడన్ షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే ఔటర్‌రింగ్‌ రోడ్డుపై పలుమార్లు

ముస్లింలపై నోరు జారిన బీజేపీ నేత

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల నోరు జారుడు ఎక్కువైంది. తాము ఏం మాట్లాడుతున్నామో..

అంతా అబద్ధమే.. కోర్టులోనే తేల్చుకుంటాం..: మోహన్ బాబు

ప్ర‌ముఖ‌ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్ష‌ను ఖ‌రారు చేసింద‌ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌న్ క‌న్నుమూత

సీనియ‌ర్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌న్‌(79)  నేడు ఆయ‌న స్వ‌గృహంలో క‌న్నుమూశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కొన్ని రోజులుగా అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స చేయించుకుంటున్నారు.

'బుల్ రెడ్డి...' అంటున్న పాయ‌ల్‌

'RX 100' చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా