ఇన్నాళ్లు బుకాయించి.. నిజం ఒప్పేసుకున్న పాక్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఉగ్రమూకలను అంతమొందించేందుకు బాలకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసి సుమారు 300మందిని మట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఎఫ్–16 విమానాలను వినియోగించి పాక్ పైత్యం ఏంటో తెలియజేసింది. అయితే దీన్ని పసిగట్టిన భారత్.. పాక్‌కు ముచ్చెమటలు పట్టించి మిగ్-21తో వెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఆ పాక్ విమానాన్ని కూల్చేశారు.
అయితే ఈ విషయం బయటికి తెలిస్తే దేశం పరువుపోతుందని భావించిన పాక్ తాము ఎఫ్-16 వినియోగించలేదని ఇన్ని రోజులూ చెప్పుకొచ్చింది. వాస్తవాన్ని దాచి అబద్ధాన్ని అల్లిన పాక్ బాగోతం ఎట్టకేలకు బయటపడింది. అవును.. తమ ఎఫ్–16 యుద్ధ విమానాలే భారత్ విమానాలను కూల్చేశాయని ఫస్ట్ టైం నోరు విప్పి వాస్తవాన్ని బయటపెట్టింది.
ఇదీ అసలు కథ..
ఎఫ్-16 యుద్ధ విమానాలను పలు షరతులతో అమెరికా దేశం పాక్‌కు విక్రయించింది. అది కూడా కేవలం ఉగ్రవాద నిరోధానికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. అయితే పాక్ మాత్రం భారత్‌పై వాడటంతో ఈ ఎఫ్-16కు సంబంధించిన వివరాలు, వివరణ ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. అప్పుడిక చేసేదేమీ లేక నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. కాగా.. ఫిబ్రవరి 27న ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుందని.. మా వద్ద ఉన్న ఎఫ్–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్ కూల్చలేదని పాక్ ఎయిర్‌ఫోర్స్ అధికారి గఫూరే ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాక్ ఇప్పుడు ఏమంటోంది..!
పదే పదే అమెరికా వివరణ ఇవ్వాలని కోరుతుండటంతో ఎట్టకేలకు నిజం బయటపెట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి పాక్ మేజర్ ఓ ప్రకన విడుదల చేశారు. " అవును.. మా ఎఫ్-16 యుద్ధ విమానాలే భారత మిగ్‌ను కూల్చివేశాయి. ఫిబ్రవరి 27న నియంత్రణ రేఖ వెంబడి తమ గగన తలం నుంచే దాడులు చేశాము. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్-16 విమానాలు కూడా ఉన్నాయి" అని పాక్ నోట నిజం వచ్చేసింది. కాగా.. ఈ విషయంలో పాక్‌పై అమెరికా ఎలా స్పందిస్తుంది..? ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments