పాక్‌లో ఇండియ‌న్ సినిమాల‌ పై బ్యాన్‌

  • IndiaGlitz, [Saturday,May 26 2018]

భార‌తీయ సినిమాల ప‌ట్ల పాక్ త‌న వ‌క్ర‌బుద్ధిని చాటుకుంది. ఈద్ ముందు నుండి ఈద్ ముగిసిన రెండు వారాల వ‌ర‌కు పాక్‌లో బారతీయ సినిమాలు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని అధికారిక స‌మాచారాన్ని ఇచ్చారు పాక్ ఉన్న‌తాధికారి ద‌న్యాల్ గిలానీ.

నిషేధం ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు విడుద‌ల చేసుకోవ‌చ్చున‌ని తెలిపింది. పాక్ సినిమాల‌కు స‌రైన వ‌సూళ్లు రాక‌పోవ‌డం కూడా ఇలాంటి చర్య‌ల‌కు కార‌ణ‌మ‌ని కొంద‌రు చెబుతున్నారు పాక్‌లో భారతీయ సినిమాల‌కు ఎక్కువ సంఖ్య‌లో అభిమానులు ఉండ‌టం వ‌ల్ల వారి సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం లేదు.