సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'పాకశాల'

  • IndiaGlitz, [Thursday,October 15 2015]

ఐశ్వర్య సినీ స్టూడియో బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్ కిరణ్, ఆర్.పి.రావు నిర్మించిన చిత్రం పాకశాల. విశ్వ, శ్రీనివాస్, కీర్తి, జగదీష్ రెడ్డి, అర్పిత, వైజాగ్ ప్రసాద్ ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

పాశశాల' సినిమా మొదటి కాపీ తయారైనప్పటి నుండి సెన్సార్ కార్యకరమాలను పూర్తి చేసుకోవడానికి అయిదునెలలు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక్కడ సెన్సార్ బోర్డు అభ్యంతరాల తెలియజేసినప్పుడు ట్రిబ్యునల్ స్థాయిలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశాం. ట్రిబ్యునల్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శ్రీమతి రేఖా ఖేత్రపాల్, మెంబర్స్ బీనా గుప్తా, శేఖర్ అయ్యర్, విపిన్ గోగియా, రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డిగారికి ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నామని నిర్మాతలు రాజ్ కిరణ్, ఆర్.పి.రావు తెలియజేశారు. గతంలో షార్ట్ ఫిలింస్ డైరెక్ట్ చేశాను. వంటగది నేపథ్యంలో జరిగే సినిమా ఇది. కంప్లీట్ గా కొత్తవాళ్ళతో చేసిన చిత్రమిది. సెన్సార్ జరిగే కార్యక్రమంలో అనేక సమస్యలను ఎదుర్కొని సక్సెస్ అయ్యాం. నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా అవుట్ పుట్ బాగా రావడంలో సపోర్ట్ చేశారు. సహకరించిన అందరికీ థాంక్స్ అని దర్శకుడు పణి కృష్ణ సిరికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కథా రచయితన గురుకిరణ్, శ్రీనివాస్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: గురుకిరణ్, సంగీతం: శ్రవణ్ ఎస్.మిక్కీ, సాహిత్యం: హరీష్ చక్ర సతీష్, కెమెరా: భరద్వాజ్ దాసరి, నిర్మాతలు: రాజ్ కిరణ్, ఆర్.పి.రావు, దర్శకత్వం: పణి కృష్ణ సిరికి .

More News

ఆరెంజ్ మూవీ పై చరణ్ కామెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత నటించిన చిత్రం ఆరెంజ్.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్..ఓ రేంజ్ లో విజయం సాధిస్తుందనుకున్నారు.

హ్యాపీ బర్త్ డే సాయిథరమ్ తేజ్

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం రేయ్ అయినప్పటికీ రిలీజైంది మాత్రం పిల్లా నువ్వులేని జీవితం.

స్వీటీ సింగం అందుకే చేయలేదు

బాలీవుడ్ సింగంలో అనుష్క కు ఆఫర్ వచ్చింది.అయితే ఆమె కాదనడంతో ఆ ఆఫర్ కాజల్ ను వెతుక్కుంటూ వెళ్ళింది.

చరణ్ లో మరో కోణం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బ్రూస్ లీ ద ఫైటర్’. శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

మ‌హేష్..వ‌స్తున్నాడా

ఆర్య చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..జ‌గ‌డం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను అందిస్తున్న డైరెక్ట‌ర్ సుకుమార్.