యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో తెలీదు: పాక్ ప్రధాని

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తోక ముడిచిన పాకిస్థాన్ తిక్క కుదిరినట్లుంది. అందుకే భారత్‌‌తో చర్చలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. శాంతియుత వాతావరణంలో చర్చించుకుంటే మంచిదన్నారు. ఇద్దరు భారత పైలట్లు అదుపులో ఉన్నారని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. అయితే ఉదయం పాక్ భద్రతా దళాల అధికారి మాత్రం ఒక పైలెట్ మా చేతికి చిక్కారని వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ మాత్రం ఇద్దరున్నారని చెప్పడం గమనార్హం. అంతేకాదు భారత్‌‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామన్నారు.

ఇమ్రాన్ ఖాన్ మాటల్లోనే...

పుల్వామా దాడితో కావాల్సిన వాళ్లను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కలిగిన బాధను అర్థం చేసుకోగలం. పుల్వామా దాడిపై భారత్‌‌కు మేం పూర్తిగా సహకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదాన్ని పాక్ భూభాగం మీద ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించేది లేదు. యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో తెలియదు. భారత్‌‌తో చర్చలకు మేం రెడీ. సహనం కోల్పోతే పరిస్థితులు నా అదుపులో ఉండవ్.. భారత ప్రధాని మోదీ అదుపులో ఉండవ్. ఉద్రిక్తతలు హెచ్చుమీరితే పరిస్థతులు తీవ్రంగా ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఆయుధాలే మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ యుద్ధం వైపు కాకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరిద్దాం. ఉగ్రవాద అంతానికి ఏం చేయాలో మీరే (ప్రధాని మోదీ) సూచించండి.

More News

వైసీపీ లో చేరిన దగ్గుపాటి, ఆమంచి

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుపాటి హితేశ్ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

సర్జికల్ స్ట్రైక్స్ వీడియోస్‌‌పై క్లారిటీ వచ్చేసింది..

పాక్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌‌లో ఉగ్రవాదుల స్థావరం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

మార్చి 15న 'వేర్ ఈజ్ ది వెంక‌ట‌లక్ష్మీ'

గురునాథ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.బి.టి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో కిషోర్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

కుప్పకూలిన విమానం.. ఇద్దరు భారత్ ఫైలెట్లు సజీవ దహనం

భారత్‌‌-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

'మ‌హ‌ర్షి' విడుదల తేదీ ఖరారు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'.