యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో తెలీదు: పాక్ ప్రధాని
Send us your feedback to audioarticles@vaarta.com
గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తోక ముడిచిన పాకిస్థాన్ తిక్క కుదిరినట్లుంది. అందుకే భారత్‌తో చర్చలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. శాంతియుత వాతావరణంలో చర్చించుకుంటే మంచిదన్నారు. ఇద్దరు భారత పైలట్లు అదుపులో ఉన్నారని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. అయితే ఉదయం పాక్ భద్రతా దళాల అధికారి మాత్రం ఒక పైలెట్ మా చేతికి చిక్కారని వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ మాత్రం ఇద్దరున్నారని చెప్పడం గమనార్హం. అంతేకాదు భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామన్నారు.
ఇమ్రాన్ ఖాన్ మాటల్లోనే...
"పుల్వామా దాడితో కావాల్సిన వాళ్లను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కలిగిన బాధను అర్థం చేసుకోగలం. పుల్వామా దాడిపై భారత్‌కు మేం పూర్తిగా సహకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదాన్ని పాక్ భూభాగం మీద ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించేది లేదు. యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో తెలియదు. భారత్‌తో చర్చలకు మేం రెడీ. సహనం కోల్పోతే పరిస్థితులు నా అదుపులో ఉండవ్.. భారత ప్రధాని మోదీ అదుపులో ఉండవ్. ఉద్రిక్తతలు హెచ్చుమీరితే పరిస్థతులు తీవ్రంగా ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఆయుధాలే మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ యుద్ధం వైపు కాకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరిద్దాం. ఉగ్రవాద అంతానికి ఏం చేయాలో మీరే (ప్రధాని మోదీ) సూచించండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com