'పైసా వసూల్' ..హల్ చల్...

  • IndiaGlitz, [Saturday,July 29 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రం 'పైసా వ‌సూల్‌' సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది. కుదిరితే సినిమా ఇంకా ముందుగా కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ సినిమా స్టంప‌ర్ నిన్న విడుద‌లైంది. పూరి స్టైల్ ఆఫ్ డైలాగ్స్‌ను బాల‌కృష్ణ త‌న‌దైన శైళిలో చెప్ప‌డం అభిమానుల‌ను అల‌రిస్తుంది.

స్టంప‌ర్ మూడు మిలియ‌న్ డిజిటల్ వ్యూస్ దిశ‌గా సాగిపోతుంది. పూరి అంటేనే హీరోను మాస్‌గా చ‌క్క‌గా ఎలివేట్ చేస్తాడు. మ‌రి మాస్ ఇమేజ్ ఉన్న బాల‌య్య‌ను ఎలా ఎలివేట్ చేస్తాడోన‌ని అంద‌రిలో ఉన్న ఆస‌క్తి స్టంప‌ర్‌తో మ‌రింత పెరిగింది. శ్రియాశ‌ర‌న్‌, ముస్కాన్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. కైరా ద‌త్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రంలో బాల‌య్య గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. ఆగ‌స్ట్ 3న బాల‌య్య 102వ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నాడు. న‌య‌న‌తార హీరోయిన్‌. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు. సి.క‌ళ్యాణ్ నిర్మాత‌.