డబ్బింగ్ పనుల్లో 'పైసా వసూల్'
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం `పైసా వసూల్`. బాలకషృష్ణ 101వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనపడతారు.
బాలయ్య సరసన శ్రియా శరన్, ముస్కాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 102వ సినిమాను స్టార్ట్ చేస్తాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. నయనతార హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com