'పైసా వసూల్ ' పాటల విడుదల తేది ఖరారు..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `పైసా వసూల్` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రుమాలను జరుపుకుంటుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆగస్ట్ 17న ఖమ్మంలోని ఎస్.ఆర్., బిజిఎంఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారట. శ్రియాశరన్, ముస్కాన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో కైరాదత్ కీలకపాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిచంనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com